Begin typing your search above and press return to search.

ఏఎన్నార్ వ‌చ్చినా ఎన్టీఆర్ హైద‌రాబాద్‌కు ఎందుకు రాలేదు...!

By:  Tupaki Desk   |   1 Oct 2022 11:30 PM GMT
ఏఎన్నార్ వ‌చ్చినా ఎన్టీఆర్ హైద‌రాబాద్‌కు ఎందుకు రాలేదు...!
X
దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి అన్న‌ ఎన్టీఆర్‌కు హైద‌రాబాద్‌కు అవినాభావ సంబంధం ఉంది. హైద‌రాబాద్‌ను డెవ‌ల‌ప్ చేయ‌డం లోనూ.. జంట‌న‌గ‌రాల‌ను తీర్చిదిద్ద‌డంలోనూ.. ఆయ‌న తిరుగులేని కృషి చేశారు. అలాంటి అన్న‌గారు.. హైద‌రాబాద్‌లో మ‌కాం పెట్ట‌డంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

నేను రాన‌ని తేల్చిచెప్పారు. నిజానికి అప్ప‌టికే అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, గుమ్మ‌డి వెంక‌టేశ్వ‌రావు.. వంటి వారు చాలా మంది అప్ప‌టి ప్ర‌భుత్వం ఇచ్చిన హామీతో హైద‌రాబాద్‌కు వ‌చ్చేశారు. ముఖ్యంగా ఇండ‌స్ట్రీ హైద‌రాబాద్‌కు రావాల‌ని ప‌ట్టుబ‌ట్టిన వారిలో ఏఎన్నార్ ముందు వ‌రుస‌లో ఉన్నారు.

ఆయ‌న ఇండ‌స్ట్రీ హైద‌రాబాద్‌కు రావ‌డానికి 20 ఏళ్లు ముందే ఏఎన్నార్ హైద‌రాబాద్‌కు వ‌చ్చేశారు.
కాన్నీ అన్న‌గారు మాత్రం రాలేదు. అంతేకాదు అస‌లు.. ఈ విష‌యంలో రాజ‌కీయ నేతల జోక్యాన్ని ఆయ‌న అస‌లు స‌హించ‌లేదు. ఎందుకంటే.. అప్ప‌ట్లోనూ.. కాంగ్రెస్ నేత‌లు.. చాలా మంది సినిమా రంగంతో పెన‌వేసుకున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వీరి ఫొటోలు వినియోగించ‌డం.. వారిని ప్ర‌చారానికి పిల‌వ‌డం వంటివి చేశారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నేత‌ల‌తో ఉన్న ప‌రిచ‌యాల రీత్యా అక్కినేని హైద‌రాబాద్‌కు వ‌చ్చారు.

కానీ, కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి వంటివారు చెప్పినా అన్న‌గారు మాత్రం రాలేదు. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం నిల‌బ‌డిన‌ప్పుడు వ‌స్తాన‌ని చెప్పారు. అయితే.. ఆయ‌న అన్న‌ట్టుగానే.. 1975 త‌ర్వాత‌.. అన్న‌గారు.. పార్టీ పెట్టాల‌నే ప్ర‌య‌త్నం చేసిన స‌మ‌యంలోనే హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. పూర్తిగా స్థిర‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే తెలుగు వారి ఆత్మగౌర‌వ నినాదంతో ఆయ‌న పార్టీ పెట్టి.. త‌ర్వాత‌.. పూర్తిగా ఇండ‌స్ట్రీని తెలుగు దేశానికి ర‌ప్పించారు.

అంటే.. ఎక్క‌డా కూడా రాజ‌కీయాలతో ఆయ‌న ప్ర‌భావితం కాలేదు. అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది ఆయ‌న‌కు అండ‌గా ఉన్నారు. అందుకే ఆయ‌న ముఖ్య‌మంత్రి అయ్యాక ఇండ‌స్ట్రీకే చెందిన రావుగోపాల‌రావు, మోహ‌న్‌బాబు లాంటి వాళ్ల‌ను రాజ్య‌స‌భకు పంపి త‌న సినీ ప్రీతి చాటుకున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.