Begin typing your search above and press return to search.

బద్వేల్ ఉప ఎన్నిక నుంచి పవన్ కళ్యాణ్ ఎందుకు వైదొలిగారు?

By:  Tupaki Desk   |   3 Oct 2021 4:08 AM GMT
బద్వేల్ ఉప ఎన్నిక నుంచి పవన్ కళ్యాణ్ ఎందుకు వైదొలిగారు?
X
వైసీపీపై తొడగొట్టి ఓడిస్తామని ప్రకటన చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఆ ప్రకటన చేసిన వెంటనే వచ్చిన 'బద్వేలు' ఉప ఎన్నికల్లో మాత్రం పోటీచేయకుండా తప్పుకున్నారు. మానవత్వం కారణం చూపి ఆ ఎన్నికల్లో జనసేన పోటీకి దూరమని ప్రకటించారు. అనంతపురం జిల్లా కొత్తచెరువు సభలో ప్రసగించిన పవన్ చేసిన ఈ ప్రకటన ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన పోటీ చేయ‌దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. చ‌నిపోయిన వ్య‌క్తి స‌తీమ‌ణిని గౌర‌విస్తూ పోటీ నుంచి త‌ప్పుకుంటున్నామన్నారు. పోటీ చేయ‌మ‌ని ఒత్తిడి వ‌చ్చిందని కానీ.. ఏక‌గ్రీవం చేసుకోవాల‌ని కోరుతున్నా అని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పిలుపునిచ్చారు. రాజకీయాల్లో విలువలు ముఖ్యం అని పవన్ స్పష్టం చేశారు.

ఈనెల 30న కడప జిల్లాలోని బద్వేల్ కు ఉప ఎన్నిక జరుగబోతోంది. ఈ ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు అధికార వైసీపీ తమ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. అటు తెలుగు దేశం పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించారు. అయితే బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అవకాశం వచ్చింది. అభ్యర్థిని ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలో జనసేన అధినేత పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని అనుకున్నా.. పవన్ కీలక నిర్ణయం తీసుకోవడంతో ఎన్నిక లేకుండానే ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నది. మరి ఏకగ్రీవంపై వైసీపీ, టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఏపీలోని రాయలసీమలో సీఎం క్యాంప్ ఆఫీస్ పెడుతామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాయలసీమ నుంచి ఎందరో సీఎంలు వచ్చినా ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదని.. పుట్టపర్తి సాయిబాబా ఒక్కరే అంత పనిచేస్తే.. ప్రభుత్వం ఎంత చేయాలని పవన్ ప్రశ్నించారు. కియా పరిశ్రమను కూడా బెదిరించారని విమర్శించారు. రాయలసీమలో సీఎం క్యాంప్ ఆఫీస్ పెడుతామని.. అభివృద్ధి చేస్తామని.. పోరాడేందుకు టీడీపీ ముందుకు రావడం లేదని తెలిపారు. జనసేనకు అలాంటి భయం లేదని.. వైసీపీ భయపడవద్దని పవన్ చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని జనసేన అధినేత పవన్ అన్నారు. వైసీపీ పాలన బాగుంటే రోడ్లమీదకు వచ్చేవాళ్లం కాదు.. అర్హులు అందరికీ పెన్షన్లు అందడం లేదు.. పోలీసులకు టీఏలు, డీఏలు కూడా ఇవ్వడం లేదు. కొందరి వల్ల రెడ్డి సామాజికవర్గంలోని అందరికీ చెడ్డ పేరు, కులాలు, మతాలకు అతీతంగా నేను అండగా ఉంటానని.. భయపెడితే పరిశ్రమలు ఎక్కడ నుంచి వస్తాయని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.