Begin typing your search above and press return to search.

ఆరు నెలల్లోనే బీజేపీ ఎందుకు ఓడింది?

By:  Tupaki Desk   |   23 Dec 2019 9:26 AM GMT
ఆరు నెలల్లోనే బీజేపీ ఎందుకు ఓడింది?
X
ఆరే ఆరు నెలలు.. ఇదే జార్ఖండ్ రాష్ట్రం లో బీజేపీ దున్ని పారేసింది.సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఖాతా తెరవనీయకుండా మెజార్టీ ఎంపీ సీట్ల ను చేజిక్కించుకుంది. జేఎఎం ను రెండు సీట్ల కే పరిమితం చేసింది. ఆరు నెలల తర్వాత జార్ఖండ్ లో బీజేపీ పాలనే అనుకున్నారంతా.. కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. ఆరు నెలల్లోనే జార్ఖండ్ ఓటర్లు బీజేపీ కి దిమ్మ దిరిగే షాకిచ్చారు. జార్ఖండ్ ఓటర్లు ఇచ్చిన షాక్ తో రెండోసారి గెలుస్తామనుకున్న కమల నాథుల ఆశలు అడియాశలయ్యాయి.

మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో జార్ఖండ్ లో మొత్తం 14 ఎంపీ సీట్లు ఉంటే అందులో 12 సీట్లను గెలిచి సత్తా చాటింది బీజేపీ.. కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవ లేదు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) రెండు ఎంపీ సీట్లను గెలుచుకొని బతుకు జీవుడా అంటూ బయట పడింది.

సరిగ్గా ఆరు నెలల్లోనే బీజేపీ పరిస్థితి తలకిందులైంది. 12 ఎంపీ స్థానాలు గెలిచి జార్ఖండ్ మాదే అని నినదించిన కమల నాథులను ఓడించారు జార్ఖండ్ ఓటర్లు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి బలమైన బీజేపీ ని ఢీ కొట్టాయి. కానీ స్థానిక అంశాలు ప్రాతి పదికన ఓటర్ల ను బీజేపీ ని ఓడించి జేఎంఎం కూటమి ని గెలిపించారు. జాతీయ కోణాని కి, రాష్ట్రీయ స్థానిక కోణాలకు వేరు వేరు అని బీజేపీని తిరస్కరించారు. స్థానికుల కే పట్టం కట్టారు.

స్థానిక సమస్యలు, మౌళిక సదుపాయాల కల్పనలో బీజేపీ వైఫల్యం.. అన్నింటికి మించి గిరిజనుల భూములను కార్పొరేట్లకు ఇచ్చే బీజేపీ నిర్ణయమే బీజేపీని ఓడించిందని విశ్లేషకులు చెబుతున్నారు.హేమంత్ సోరెన్ గిరిజన హక్కుల కోసం చేసిన పోరాటం కూడా ఆయనను గెలిపించిందంటున్నారు.