Begin typing your search above and press return to search.
ఆ వీడియోను బీజేపీ ఎందుకు ట్వీట్ చేసింది?
By: Tupaki Desk | 24 Oct 2019 5:28 AM GMTతనకు మాత్రమే తెలిసిన వ్యూహాన్ని వ్యూహాత్మకంగా అమలు చేయటం.. తాను కోరుకున్న రీతిలో పరిణామాలు చోటు చేసుకునేలా చేయటంలో కొందరు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. ఇందుకు బీజేపీ సైతం మినహాయింపు కాదు. ప్రధాని మోడీ ఇమేజ్ ను ఒక క్రమపద్దతిలో పెంచటంతో పాటు.. అవసరమైన విషయాల కంటే ప్రజల్ని ఆకర్షించే అంశాలకు సంబంధించిన ప్రచారానికి బీజేపీ పెద్ద పీట వేసే తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
వారం క్రితం బాలీవుడ్ ప్రముఖులు పలువురితో ప్రధాని మోడీ సమావేశం కావటం తెలిసిందే. గాంధీజీ 150 జయంతి నేపథ్యంలో సినిమాల్లో నటించే నటుల్ని ఢిల్లీకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రధానమంత్రితో సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పటివరకూ ఎప్పుడూ చోటు చేసుకోని ఈ ఉదంతంతో బాలీవుడ్ ప్రముఖులు భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
దేశ ప్రధాని తమను గుర్తించి తీసుకురావటమే కాదు.. మీరిచ్చే సలహాల్ని నేను వినాలనుకుంటున్నానన్న మాట చెప్పటంతో ఎమోషనల్ అయ్యారు. ఎంత వెండితెర వెలుగులు చిమ్మే నటులైనా.. దేశానికి రారాజు లాంటి అధినేత తమ మాటల్ని నేరుగా వింటానని చెప్పటానికి మించిన సంతోషం ఏముంది? అందుకే వారు విపరీతమైన ఎమోషన్ కు గురై.. ఇప్పటివరకూ తమకు ఇలాంటి గౌరవం దక్కలేదని.. తమను గుర్తించినందుకు థ్యాంక్స్ చెప్పాలంటూ పొంగిపోయారు.
బాలీవుడ్ ప్రముఖులతో మోడీ భేటీ సందర్భంగా మోడీ ఇమేజ్ గ్రాఫ్ పెరిగిందే తప్పించి..దేశానికి ఒరిగిందేమీ లేదన్న విషయం ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన న్యూస్ ఆర్టికల్స్ ను జాగ్రత్తగా చదివితే ఇట్టే అర్థమైపోతుంది. నిజానికి బాలీవుడ్ ప్రముఖులతో మోడీ భేటీ కార్యక్రమానికి వచ్చిన ప్రచారం అంతా ఇంతా కాదు. కానీ.. వారం తర్వాత సదరు సమావేశానికి సంబంధించిన వీడియోను బీజేపీ తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేయటాన్ని ఏమనాలి? ఎందుకు చేసినట్లు? అంటే.. మోడీ ఇమేజ్ ను పెంచటంతో పాటు.. బాలీవుడ్ లో వామపక్ష భావజాలం ఉన్న ఒక వర్గం ప్రధానిపై గుస్సా కావటం తెలిసిందే. అందుకు పోటీగా.. బాలీవుడ్ లో జనాదరణ పొందిన ఒక వర్గం తనవైపు ఉన్నారన్న విషయాన్ని లోకానికి తెలిసేలా చేయటం ద్వారా.. బాలీవుడ్ లోని వామపక్ష వాదుల నోటికి తాళాలు వేయటం.. వారి విమర్శల తీవ్రతను తగ్గించే ప్లానింగ్ తోనే ఈ కార్యక్రమం చోటు చేసుకుందున్న మాట వినిపిస్తోంది. మోడీనా.. మజాకానా?