Begin typing your search above and press return to search.
పోలవరం పథకం గురించి నన్ను అడగవద్దు అని ఆ రోజు అన్నారు ఎందుకని?
By: Tupaki Desk | 9 July 2022 8:32 AM GMTచినబాబు లోకేశ్ ను మంత్రి అనిల్ తిట్టారు. ఇకపై చంద్రబాబు ఆటలు సాగవు అని కూడా అన్నారు. ఎందుకని ఆయన పదే పదే నేనే రీఛార్జ్ అయ్యాను.. అని అన్నారో కానీ జగన్ మోహన్ రెడ్డి కనుసైగ చేస్తే ప్రతిపక్షాలు లేకుండా పోతాయి అని అన్నారు కూడా ! ఇవన్నీ రేపటి వేళ ఏ మేరకు ప్రభావితం చేస్తాయో అన్నది చూడాలిక.
ముఖ్యంగా పవన్ ను ఉద్దేశించి అనిల్ నోటికి వచ్చిన విధంగా మాట్లాడారు. ఎవరు ఎందుకు ఎలా మాట్లాడినా సరే రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అయి తీరుతారని ఆయన పునరుద్ఘాటన చేశారు.
ఇవన్నీ బాగానే ఉన్నాయి. అనిల్ పదవి ఉన్నా లేకపోయినా జనం కోసమే పనిచేస్తాను అని ఎందుకని చెప్పలేకపోయారు అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. పోలవరం పథకం గురించి నన్ను అడగవద్దు అని ఆ రోజు ఎందుకు పదవి పోగానే వ్యాఖ్యానించారు అని కూడా మరో ప్రశ్న రూపంలో వినిపిస్తోంది.
అంటే ప్రతిపక్షాలను తిట్టేందుకు మాత్రమే అనిల్ సిద్ధంగా ఉంటారా అంతేకానీ ప్రాజెక్టుల గురించి నాటి జలవనరుల శాఖ మంత్రి హోదాలో మాట్లాడిన మాటలు గురించి ఆయనేం పట్టించుకోరా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.
ఏదేమయినప్పటికీ పవన్ ను ఉద్దేశించి మరోసారి అనిల్ చేసిన వ్యాఖ్యలపై జనసేన మండిపడుతోంది. నిర్మాణాత్మక వైఖరితో రాజకీయం చేయాలే కానీ అతి విమర్శలు అనర్థ దాయకం అని అంటున్నారు. పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసి కేంద్రంలో ఉన్న బీజేపీని అస్సలు ఏమీ అనకపోవడం కూడా ఆశ్చర్యకరం.
అంటే బీజేపీతో బంధాలున్నాయని నిర్థారించుకోవాలా అని కూడా ప్రశ్నిస్తోంది విపక్షం. అందుకే రాష్ట్రంలో తగాదాలు ఉన్న విధంగా పైకి కనిపించినా కేంద్రంతో సఖ్యతతో ఉంటూ ప్రతి పనికీ వత్తాసు పలకడం వైసీపీకే చెల్లు అని టీడీపీ అంటోంది. విమర్శలు గుప్పిస్తోంది.