Begin typing your search above and press return to search.
పవన్ కు.. జేడీ లక్ష్మీనారాయణకు చెడింది అక్కడేనా?
By: Tupaki Desk | 8 Aug 2019 11:32 AM GMTజనసేనలో పేరున్న నేతలన్నంతనే గుర్తుకు వచ్చేది నాదెండ్ల మనోహర్.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణే. మరి.. అలాంటి మాజీ జేడీ ఈ మధ్యన పార్టీ కార్యకలాపాల్లో ఎందుకు కనిపించట్లేదు? ఇటీవల పవన్ ప్రకటించిన కీలక కమిటీల్లో ఆయన పేరు ఎందుకు లేదు? గడిచిన కొంతకాలంగా జనసేనను జేడీ లక్ష్మీనారాయణ వీడతారన్న ప్రచారం నిజమేనా? అసలు.. పవన్ కు.. లక్ష్మీనారాయణకు చెడింది ఎక్కడ? వీరి మధ్య పెరిగిన గ్యాప్ పూడ్చలేనంతగా పెరిగిందన్న మాటలో నిజం ఎంత? అన్న విషయాల్లోకి వెళితే..
ఏపీ లో కీలకభూమిక పోషించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిజాయితీపరుడిగా పేరుతో పాటు.. ఎవరికీ లొంగరన్న మాట వినిపించినా.. కొన్ని వర్గాల వారికి మాత్రం ప్రాధాన్యత ఇస్తారన్న మచ్చను వేసుకున్నారు. గ్రామ స్వరాజ్యమే తన స్వప్నంగా చెప్పుకునే జేడీ లక్ష్మీనారాయణ తన సర్వీసు కాలం పూర్తి కాక ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకొని సంచలనంగా మారారు.
సొంతంగా పార్టీ పెడతారన్న ప్రచారం సాగినా.. ఆయన అందుకు భిన్నంగా జనసేనలో చేరటం ద్వారా పలువురిని విస్మయానికి గురి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీగా జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఓడిపోవటం ఒక ఎత్తు అయితే.. దాదాపు 3 లక్షల ఓట్లు తెచ్చుకోవటం చూస్తే.. గౌరవప్రదమైన ఓటమిగా పలువురు అభివర్ణించారని చెప్పాలి. ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనని మాజీ జేడీ.. అంతకంతకూ పార్టీకి దూరమైపోతున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ.. తన సొంత సంస్థ కార్యకలపాల్లో ఎక్కువగా పాలుపంచుకోవటం చేస్తున్నారు. ఇందుకోసం జనసైనికుల్ని వినియోగించుకోవటం ఆసక్తికరంగా మారింది.పార్టీకి దూరంగా ఉంటూ పార్టీ కార్యకర్తల్ని తన ఫౌండేషన్ కార్యక్రమాల కోసం వినియోగించుకోవటంపై పవన్ కల్యాణ్ కాస్తంత గుర్తుగా ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ తరఫున పని చేయాలో కానీ.. తన సొంత సంస్థను తెర మీదకు తెచ్చి ప్రోగ్రామ్ లు నిర్వహించటం ఏమిటన్న గుర్రు పవన్ లో దని చెబుతున్నారు. ఇదే మాజీ జేడీకి.. పవన్ కు మధ్య దూరం పెరగటానికి కారణమని చెబుతున్నారు.
మరోవైపు లక్ష్మీనారాయణ వర్గీయుల వాదన మరోలా ఉంది. జనసేనలో పవన్ తర్వాత పేరున్న నాయకుడు జేడీ లక్ష్మీనారాయణేనని.. ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత పార్టీలో లభించటం లేదని.. సాధారణ కార్యకర్త మాదిరి గంటల కొద్దీ సమయం పవన్ ను కలవటం కోసం వెచ్చించాల్సి రావటం ఏమిటన్న వాదనను వినిపిస్తున్నారు. ఏతావాతా పవన్.. మాజీ జేడీల మధ్య గ్యాప్ వచ్చిందన్నది వాస్తవమని తేలినట్లే. మరి.. ఆయన పార్టీలో ఉంటారా? వెళ్లిపోతారా? అన్నది కాలమే సమాధానం చెబుతుందన్న మాట వినిపిస్తోంది.