Begin typing your search above and press return to search.

మీకు అధికారం ఎందుకు... ఇంట్లో కూర్చోండి ..ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   7 Nov 2019 5:12 AM GMT
మీకు అధికారం ఎందుకు... ఇంట్లో కూర్చోండి ..ఏమైందంటే ?
X
గత కొన్ని రోజులుగా ఢిల్లీ లో కాలుష్యం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. సాధారణ రోజుల్లోనే ఢిల్లీ లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఈ మద్యే దీపావళి పండుగ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ తో పాటుగా సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో పటాకులు కాల్చారు. దీనితో ఎన్నడూ లేని రీతిలో ఢిల్లీ ని కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కాలుష్యాన్ని తగ్గించలేక పోతున్నారు. దీనితో ఢిల్లీ లో స్కూల్స్ కి సెలవులు ఇచ్చారు. అలాగే మరోసారి వాహనాల విషయంలో సరి , బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఇక తాజాగా ఢిల్లీ లో ఈ రేంజ్ లో కాలుష్యం పెరగడం పై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది . ఢిల్లీ లో కాలుష్యం పెరగడానికి .దీపావళి పండుగతో పాటుగా , పక్క రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా లో పంట వ్యర్థాల దహనమే కారణం. ఈ నేపథ్యంలోనే ..పశువుల ప్రాణాలు పోతే పట్టించుకునే ప్రభుత్వాలు... మనుషులు ప్రాణాలంటే అసలు లెక్కలేదా అని ప్రశ్నించింది. ప్రతి యేడాది లాగే ఈ ఏడాది కూడా పంట వ్యర్థాలను తగలబెడతారని తెలుసు కదా , అయినా ప్రభుత్వాలు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది.

రైతుల నుంచి పంట వ్యర్థాలను సేకరించడమో, కొనుగోలు చేయడమో ఎందుకు చేయలేదని, ఈ విషయంలో ఆ రెండు ప్రభుత్వాలు విఫలమయ్యారని మండిపడింది. అంతేకాకుండా అధికారులను సైతం శిక్షించే సమయం వచ్చిందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాలపై తీవ్రంగా మండిపడింది. విమానాలను దారి మళ్లించాల్సి వస్తోంది. ప్రజలకు తమ ఇళ్లల్లోనే రక్షణ లేకుండా పోతోంది. ఇవన్నీ చూస్తే మీకు సిగ్గు వేయడం లేదా మీకు అంటూ .. అసలు ప్రజల గురించి పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారంలో ఉండే హక్కే లేదని ఫైర్ అయ్యింది.