Begin typing your search above and press return to search.

మోడీ - పార్లమెంటు - ఓ ఇంట్రస్టింగ్ కథ..

By:  Tupaki Desk   |   18 July 2018 5:04 AM GMT
మోడీ - పార్లమెంటు - ఓ ఇంట్రస్టింగ్ కథ..
X
తొలి సారి గెలిచిన ప్రతీ ఎంపీ పార్లమెంటులోకి అడుగుపెట్టగానే ఉద్విగ్నతకు గురవుతాడు. దేశ అత్యున్నత ప్రజా ప్రతినిధ్య సభను దేవాలయంగా కొలుస్తాడు.. మోడీ కూడా గడిచిన 2014 ఎన్నికల్లో తొలిసారి ఎంపీగా గెలిచి దేశ ప్రధాని అయ్యి పార్లమెంటులోకి అడుగుపెట్టినప్పుడు అక్కడ వంగి తలను మెట్లపై ఉంచి మరీ నమస్కరించాడు. పార్లమెంట్ ఔనత్యాన్ని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. కానీ ఆ తర్వాతే పార్లమెంటును పట్టించుకోవడం లేదు. ప్రతీసారి పార్లమెంటు సమావేశాలప్పుడు ఏదైనా విదేశీ పర్యటనకో.. దేశంలో ఏదైనా సభ -సమావేశానికి హాజరవుతుంటారు. ప్రతిపక్షాలన్నీ ఎంతో ఆసక్తిగా చర్చకు దిగిన అంశాలపై మోడీ నేరుగా స్పందించడు. చివర్లో వచ్చి అదరగొడుతుంటాడు. మధ్య రోజుల్లో మోడీ ప్లేసులో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కానీ.. లేదంటే హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కానీ బదులిస్తుంటాడు.

ఈసారి కూడా పార్లమెంట్ మొదలైంది. తాజాగా వర్షకాల సమావేశాలు ఎలా నిర్వహిద్దామనే దానిపై ఢిల్లీలో అధికార - ప్రతిపక్షాలు చర్చించాయి. ఈ సమావేశం అనంతరం ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించిన ప్రధాని పలు కీలక బిల్లులపై ప్రతిపక్షాల మద్దతు కోరారు. ముస్లింల తక్షణ తలాక్ - నిఖా హలాలా బిల్లులను ఆమోదించడానికి సహకరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ ఆమోదించాలని కోరుతోంది. ఎవరి స్ట్రాటజీ వారికుంది.. అంతిమంగా ఈ మూడు బిల్లులు పాస్ అవుతాయా లేదా రసాభసతో రద్దవుతాయో చూడాలి.

అయితే షరామామూలుగానే ఈ బిల్లులపై చర్చలకు మోడీ హాజరవుతాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.. ప్రతిపక్షాలన్నీ తిట్టిపోశాక.. వివాదాస్పదం అయ్యాక చివరి రోజున వచ్చి దానిపై ఎమోషనల్ గా మాట్లాడి కానిచ్చేస్తున్నారు. ఈ తంతు గడిచిన నాలుగేళ్లుగా కొనసాగుతోంది. పార్లమెంట్ లో సభ బాధ్యతలను ఎప్పుడూ ఆర్థిక - హోం ఇతర మంత్రులే తీసుకుంటున్నారు. మొదలైనప్పటినుంచి చివరి వరకూ మోడీ చురుగ్గా పాల్గొనడం లేదు. లోక్ సభ - రాజ్యసభల్లో బీజేపీ సీనియర్ మంత్రులే ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ కానిచ్చేస్తున్నారు. ఈసారి కూడా మొదలైంది. మరి ఇప్పుడైనా మోడీ సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటాడా లేదా సెంటిమెంట్ ప్రకారం చివర్లో వచ్చి కానిచ్చేస్తాడా అన్నది వేచిచూడాలి..