Begin typing your search above and press return to search.
మతపరమైన హింస తగ్గిస్తే మూడున్నర కోట్లిస్తారట!
By: Tupaki Desk | 10 Nov 2017 10:30 AM GMTడొనాల్డ్ ట్రంప్ ....అమెరికా అధ్యక్షుడయ్యాక ఆ దేశంలో జాతి విద్వేష వ్యాఖ్యలు - జాత్యాహంకార దాడులు పెరిగిన సంగతి తెలిసిందే. అమెరికన్లలో లోకల్ సెంటిమెంట్ బలంగా పాతుకుపోయేలా ట్రంప్ భారతీయులతో పాటు అనేక ఇతర దేశాల వారి ఉద్యోగాల్లో కోత విధించాలని చూశారు. ఆరు దేశాల వారు అమెరికాలోకి రాకుండా ఆంక్షలు విధించి విమర్శలపాలయ్యారు. ఈ నేపథ్యంలో భారత్ పై అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ కు చెందిన ప్రజాస్వామ్యం - మానవ హక్కులు - కార్మిక శాఖల బ్యూరో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్ లో మతపరమైన హింస - వివక్షను తగ్గించేందుకు కృషి చేస్తామని ఆ సంస్థ చెప్పింది. అంతేకాదు - ఆ లక్ష్యం కోసం ముందుకు వచ్చే స్వచ్ఛంద సంస్థకు దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు గ్రాంటు కూడా ఇస్తామంటోంది. భారత సమాజంలో సహనాన్ని - ప్రజల భద్రతను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపింది. దాని కోసం 4,93,827 డాలర్ల గ్రాంటును మంజూరు చేస్తున్నట్లు ఓ నోటీసును విడుదల చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన నోటీసుపై అమెరికాలోని హ్యూమన్ రైట్స్ వాచ్ అనే అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ మండిపడింది. ట్రంప్ - అమెరికా....ముందు తమ గురువింద నలుపును సరిచూసుకోవాలని హితవు పలికింది. ఇంకా ట్రంప్ - అమెరికా ల వివక్ష ధోరణిపై అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల సమస్యలను వివరించే నివేదికను ఈ సంస్థ ప్రతి ఏటా విడుదల చేస్తుంది.
మానవ హక్కులకు ట్రంప్ పెను ముప్పు కలిగించారని ఆ సంస్థ ప్రకటించింది. ఎన్నికల సమయంలో ట్రంప్ అసహనంతో కూడిన రాజకీయాలు చేశారని నివేదికలో తెలిపింది. మీడియా స్వేచ్ఛను ట్రంప్ హరించారని, వారిపై కేసులు పెడతానని బెదిరించారని చెప్పింది. డాక్యుమెంట్లు లేని వలసదారులను దేశం నుంచి పంపించేస్తానని - ముస్లింలు అమెరికాలో అడుగుపెట్టకుండా పూర్తిగా నిషేధం విధించాలని కూడా చెప్పారని తెలిపింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడ ఏ మతాన్ని ఖండించకూడదు. ట్రంప్ దీనికి విరుద్ధంగా ముస్లింలపై నిషేధం విధించాలని చూస్తున్నారని చెప్పింది. జ్యూయిష్ ప్రజలపై హింసాత్మక ఘటనలను కూడా ట్రంప్ ఎపుడూ ఖండించలేదని తెలిపింది. వర్జీనియాలో జరిగిన శ్వేత జాతీయుల ఆధిపత్య ర్యాలీని 48 గంటల తర్వాత కానీ ట్రంప్ ఖండించలేదని, అది కూడా చట్ట సభల్లోని అన్ని పార్టీల సభ్యులు ఒత్తిడి తెచ్చిన తర్వాత మాత్రమే ఆయన స్పందించారని పేర్కొంది. అమెరికా సైన్యంలో ట్రాన్స్ జెండర్లు చేరడంపై నిషేధం అమల్లో ఉందని తెలిపింది.
స్వదేశంలో కొనసాగుతున్న వివక్షను ఖండించని ట్రంప్ - భారత్ లో మతపరమైన హింస - సామాజిక సహనం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని చెప్పింది.