Begin typing your search above and press return to search.

ఉల్లి సమస్య పై మోడీ ని ఎందుకు విమర్శించరు బాబు , పవన్ ..!

By:  Tupaki Desk   |   10 Dec 2019 6:30 AM GMT
ఉల్లి సమస్య పై మోడీ ని ఎందుకు విమర్శించరు బాబు , పవన్ ..!
X
ప్రస్తుతం దేశంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏది అంటే ఉల్లి సమస్యే అనే చెప్పాలి. సాధారణంగా ఉల్లి ని కోసేటప్పుడు కన్నీళ్లు వస్తాయి ..కానీ, ప్రస్తుతం కొనేటప్పుడే కన్నీళ్లు వస్తున్నాయి. నిత్యావసర సరుకుల్లో ఒకటిగా ఉండే ఉల్లి ధర గత కొన్ని రోజులుగా కొండెక్కి కూర్చుంది. దీనితో సామాన్యలు ఉల్లి కొనాలి అంటేనే వణికిపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉల్లి .. 180 -200 వరకు పలుకుతుంది. ఈ సమస్య పై పార్లమెంట్ లో కూడా చర్చలు సాగాయి. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇచ్చిన స‌మాధానం తీవ్ర విమ‌ర్శ‌ల పాలైంది. ఆమె పార్లమెంట్ లో మాట్లాడుతూ ..మా ఇంట్లో ఉల్లి ని ఎక్కువగా వాడం అని చెప్పింది. ఆమె ఇంట్లో తిననంత మాత్రానా ..దేశంలోని ప్రజలందరూ తినకుండా ఉండాలా.

ఇక పోతే ఉల్లి సమస్య ..ఇప్పుడు ఏ ఒక్క రాష్ట్రానికో సంబంధించిందో కాదు ..మొత్తం దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఉంది. కానీ , ఈ విషయం తెలిసి విమర్శిస్తున్నారో ..ఆ మాత్రం పరిజ్ఙానం లేకనో కానీ , పవన్ కళ్యాణ్ , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ...ఉల్లి సమస్య కి ప్రధానం కారణం సీఎం జగనే అన్నంతగా జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా రెచ్చిపోతున్నారు .. దేశ వ్యాప్తంగా ఈ స‌మ‌స్య ఉంద‌నే విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తించ‌డం లేదో ..లేక ఈ సమస్య పై సరైన అవ‌గాహ‌న ఉందో లేదో మ‌రి ఆయనకే తెలియాలి.

ఉల్లి గురించి ఇత‌ర రాజ‌కీయ పార్టీలు మోడీని నిల‌దీస్తున్నాయి. ఎందుకంటే దేశంలో ఉల్లి పాయ‌ల ల‌భ్య‌త లేదు. విదేశాల నుంచి దిగుమ‌తే మార్గంగా క‌నిపిస్తూ ఉంది. అది జ‌గ‌న్ చేతి లో ఉండ‌దు. మోడీ, కేంద్ర ప్ర‌భుత్వం డిమాండ్ కు త‌గ్గ‌ట్టు గా స్పందించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా దీనిపై అందరూ కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే ...బాబు , పవన్ మాత్రం ..మోడీని విమర్శించే దైర్యం లేక ..ఉల్లి సమస్య కి సీఎం జగనే కారణం అని ..జగన్ పై యుద్ధం చేస్తున్నారు. చెవుటోడి ముందు శంఖం ఊదినట్టు ... దేశ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్య పై ..సీఎం జగన్ మాత్రం ఏమి చేయగలరు.

అయినప్పటికీ , సీఎం జగన్ ప్రజల గురించి అలోచించి ..ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్లలో కిలో 25 కె పంపిణి చేస్తున్నారు. అది మాత్రం వారికీ కనిపించడం లేదు. ఉల్లి సమస్య పై కాంగ్రెస్ ఇత‌ర ప‌క్షాలు మోడీ ని విమర్శింస్తుంటే .. టీడీపీ, జ‌న‌సేన‌లు మోడీ ని పల్లెత్తు మాట కూడా అనడంలేదు. మోడీ మీద విమ‌ర్శ‌లు చేస్తే ఎక్కడ తమ కేసులు బయటపెట్టి ..తమ లొసుగులు బయట పెడతారో అని వీరు బహుశా బయపడుతుండవచ్చు ...అందుకే ఉల్లి సమస్య పై మేము కూడా పోరాటం చేస్తున్నాం అని ప్రజల దగ్గర మెప్పు పొందటానికి సీఎం జ‌గ‌న్ మీద విమ‌ర్శ‌లు చేసి పబ్బం గడుపుతున్నారు.