Begin typing your search above and press return to search.
హైద్రాబాద్ రోడ్లపై ఉమ్మితే చెల్లించాల్సిందే
By: Tupaki Desk | 3 July 2019 12:30 PM GMTహైదరాబాద్ నగరంను పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్ ఎంసీ అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చెత్తను రోడ్డుపై పడేస్తున్నట్లుగా ఎవరైనా కనిపిస్తే వారికి జరిమానా విధిస్తున్న అధికారులు తాజాగా రోడ్డుపై ఉమ్మినా కూడా జరిమానా విధిస్తున్నారు. రోడ్లపై ఎక్కడ కూడా చెత్త లేకుండా పారిశుధ్ద్య కార్మికులు ఊడుస్తున్నా కూడా కొందరు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్న కారణంగా వారి కష్టం వృదా అవుతుంది.
నేడు ఉదయం కుషాయిగూడ ఏరియాలో పారిశుద్ధ్య కార్మికులు రోడ్లను ఊడ్చుతున్నారు. ఆ సమయంలోనే అటుగా వెళ్తున్న కుషాయిగూడ డిపో బస్సు డ్రైవర్ జగదీశ్ రోడ్డుపై ఉమ్మాడు. ఆ విషయాన్ని పారిశుద్ద్య కార్మికులు చూశారు. ఆ విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు.
రోడ్డుపై ఉమ్మకూడదని జీహెచ్ ఎంసీ చాలా రోజులుగా ప్రచారం చేస్తుందని.. అయినా మీరు రోడ్డు మీదా ఉమ్మారు కనుక రూ.100 ఫైన్ చెల్లించాల్సిందేనంటూ అధికారులు ఆదేశించారు. దాంతో డ్రైవర్ జగదీశ్ ఫైన్ చెల్లించాడు. మరోసారి ఇలాంటి పని చేస్తే ఫైన్ మాత్రమే కాకుండా కఠిన శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు. మొదటి సారి కనుక 100 రూపాయల ఫైన్ తో వదిలేసినట్లుగా చెప్పారు. హైదరాబాద్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు మరింత కఠినంగా వ్యవహరిస్తామంటూ ఉన్నతాధికారులు అంటున్నారు.