Begin typing your search above and press return to search.

ఏ ప్రభుత్వమైనా అంబానీ, అదానీలకు దోచి పెట్టడమేనా ?

By:  Tupaki Desk   |   15 March 2021 3:55 PM GMT
ఏ ప్రభుత్వమైనా అంబానీ, అదానీలకు దోచి పెట్టడమేనా ?
X
ఇపుడిదే విషయమై దేశంలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ ముఖేష్ అంబానీ, అదానీల వ్యాపారాల్లో ఏమీ మార్పులు రావటం లేదు. అప్పట్లో యూపీఏ ప్రభుత్వమైనా ఇఫ్పటి ఎన్డీయే ప్రభుత్వమైనా ఒకటే పద్దతి. అదేమిటంటే అంబానీ, అదానీలు చెప్పినట్లు వినటమే. ఎందుకంటే పార్టీలు నడపటానికి అవసరమైన నిధుల కోసం పై ఇద్దరు కార్పొరేట్లపైనే ఆధారపడ్డాయి కాబట్టి.

ఒకవైపు ఇండియా పేద దేశమని అంటున్నారు. అదే సమయంలో పై ఇద్దరితో పాటు అనేకమంది కార్పొరేట్ల సంపద అంతకంతకు పెరిగిపోతోంది. అంబానీ, అదాని సంపద ఇన్ని లక్షల కోట్లని, ఒక్కరోజులో వీళ్ళ సంపది ఇన్ని వేల కోట్లు పెరిగిందని లెక్కలు చెబుతుంటారు. మరి వాళ్ళ సంపదపై ఆదాయపు పన్నుశాఖ ఉన్నతాధికారులు ఏరోజూ దాడులు జరిపిన దాఖలాల్లేవు.

మామూలు వ్యాపారులపైన దాడులు జరిపే ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు మరి వీళ్ళిద్దరి ఆస్తులు, వ్యాపారాలపై ఎందుకని దాడులు చేయటం లేదు. వాళ్ళు సక్రమంగా ఇన్ కమ్ ట్యాక్స్ కడుతున్నారా ? కడితే ఎంత కడుతున్నారు ? అనే వివరాలను దేశప్రజలకు ప్రభుత్వాలు ఎందుకని చెప్పటం లేదు. వీళ్ళిద్దరి ఆస్తులు రోజురోజు పెరుగుతున్నాయే కానీ ఏరోజు కూడా తగ్గకపోవటం గమనార్హం.

మనదేశంలో పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో అంబానీ, అదానీ లాంటి వాళ్ళ సంపదా రోజు రోజుకు పెరిగిపోతోంది. అంటే సంపన్నులు-పేదల మధ్య వ్యత్యాసం ప్రతిరోజు పెరిగిపోతోందని అర్ధమవుతోంది. మరి ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఏ ప్రభుత్వమూ కృషి చేసినట్లు కనబడదు. వీళ్ళ ఆస్తులు 500-600 శాతం పెరిగినట్లు ప్రచారం జరగటమే కానీ ఆ సంపదపై వాళ్ళు సరిగా పన్నులు కడుతున్నారా లేదా అని చెప్పేవాళ్ళు కూడా లేరు. కాబట్టే ప్రభుత్వాలు ఏవైనా వీళ్ళ సంపద మాత్రం పెరుగుతునే ఉంది.