Begin typing your search above and press return to search.
కట్టించిన హరీష్.. ప్రారంభోత్సవంలో లేడు..
By: Tupaki Desk | 21 Jun 2019 10:19 AM ISTపాపం హరీష్.. ఎవరెవరో.. ఎక్కడెక్కడో ఓపెనింగ్ లు చేస్తున్నారు. కానీ గడిచిన ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టును ఉరుకులు పెట్టించి పూర్తి చేయించిన హరీష్ నామ ఫలకం కానీ.. ఏదైనా పంప్ హౌస్ కానీ లేకపోవడం ఇప్పుడు ఆయన అభిమానులను కలవరపెడుతోంది.
కాళేశ్వరం ఘనంగా ప్రారంభోత్సవం జరుగుతోంది. సీఎం కేసీఆర్ మేడిగడ్డ వద్ద ఉదయమే పూజా కార్యక్రమాలు ప్రారంభించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అన్నారం- సుందిల్ల- కన్నేపల్లిల వద్ద మంత్రులు నిరంజన్ రెడ్డి- ఎర్రబెల్లి- కొప్పుల ఈశ్వర్- మల్లారెడ్డిలు పూజలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మేడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తే ఇక మంత్రులు అన్నారం- సుందిల్ల- కన్నేపల్లి బ్యారేజీలు- ప్రాజెక్టులోని పంప్ హౌస్ లను అధికారంగా ప్రారంభించనున్నారు. శిలా ఫలకాలపై ఈ మంత్రుల పేర్లు కూడా చెక్కబడ్డాయి..
అయితే కేసీఆర్ సీఎం హోదాలో కాళేశ్వరంను ఎంత ధృడచిత్తంతో పూర్తి చేయించాడో.. అంతే పట్టుదలతో ట్రబుల్ షూటర్ హరీష్ రావు.. గడిచిన హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా అంతే వేగంతో కాళేశ్వరం వెంటపడి పూర్తి చేయించాడు. కేసీఆర్ గొప్పగా చెబుతున్నట్టు మూడేళ్లలోనే కాళేశ్వరం పూర్తి అయ్యిందంటే అదంతా హరీష్ రావు చలవే అంటారు ఇరిగేషన్ అధికారులు..
అలాంటి గొప్ప ప్రాజెక్టు సంకల్పికి ఇప్పుడు కాళేశ్వరం ప్రారంభోత్సవంలో కనీసం చోటు లేకుండా పోవడమే విషాదంగా ఉంది. మధ్యలో కొత్తగా వచ్చిన మంత్రులు ఇప్పుడు వివిధ సహ బ్యారేజీలు- పంప్ హౌస్ లు ప్రారంభిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావుకు కనీసం శిలా ఫలకంలో పేరు కాదు కదా.. పిలుపు కూడా ఉందో లేదో తెలియని పరిస్థితి. కష్టమొకరిది..వాటిని అనుభవించే ఫలితం మరొకరిదిలా తయారైందని హరీష్ అభిమానులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.