Begin typing your search above and press return to search.
దేశంలో ఉత్కంఠ...బీజేపీ ఓటమి ఖాయమా?
By: Tupaki Desk | 11 May 2018 4:34 PM GMTదేశం చూపును తనవైపు తిప్పుకొంటున్న కన్నడ ఎన్నికలు కీలక దశకు చేరాయి.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమయింది. మొత్తం ఉన్న 224 స్థానాల్లో 222 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బెంగళూరులోని రాజరాజేశ్వరీ నగర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం హోరాహోరీగా సాగిన ప్రచార పర్వానికి గురువారం సాయంత్రం తెరపడింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ - బీజేపీ ప్రచారం సందర్భంగా పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నాయి. 1985 తరువాత కర్ణాటకలో ఏ ముఖ్యమంత్రీ వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టలేదని - కానీ తాను ఆ చరిత్రను తిరగరాయబోతున్నానని సిద్దరామయ్య ధీమా వ్యక్తంచేశారు. మూడో పక్షంగా బరిలోకి దిగిన జనతాదళ్(ఎస్) కూడా పోటాపోటీగా ప్రచారం చేసింది. ఆ పార్టీ ఎక్కువగా సిద్దరామయ్య పాలనపైనే విమర్శలు ఎక్కుపెట్టింది. ఆ పార్టీ తరఫున మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ - ఆయన కుమారుడు కుమారస్వామి ప్రచారం నిర్వహించారు. బీజేపీ జేడీ(ఎస్) మధ్య తెరవెనుక ఒప్పందం కుదిరిందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఇటు బీజేపీ పక్షాన ప్రధాని నరేంద్ర మోడీ - అటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చివరి నిమిషం వరకూ ఓటర్లను తమవైపునకు తిప్పుకొనేందుకు ప్రయత్నించారు. బీజేపీ పక్షాన మోడీ - అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు - యూపీ సీఎం ఆదిత్యనాథ్ తదితరులు ప్రచారం నిర్వహించారు. ఒక సభలో సోనియాగాంధీ విదేశీయతను ఎత్తి చూపిన మోడీ 15 నిమిషాల పాటు తన తల్లి మాతృభాష (ఇటాలియన్)తోపాటు ఏ భాషలోనైనా సరే పేపర్ లేకుండా మాట్లాడాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సిద్దరామయ్య ప్రభుత్వాన్ని సీదా రుపయ్యా సర్కార్ (లంచగొండి ప్రభుత్వం)అని మోడీ అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సిద్దరామయ్య.. రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిస్తూ మోడీ - అమిత్ షాలకు లీగల్ నోటీసులు పంపారు. ఇక రాహుల్ పాల్గొన్న ప్రతి సభలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యెడ్యూరప్పపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించారు. రూ.35వేల కోట్ల మేర లూటీ చేసిన రెడ్డి సోదరులకు - వారి అనుచరులకు ఎనిమిది టికెట్లు ఎందుకిచ్చారని నిలదీశారు. దేశవ్యాప్తంగా దళితులపై జరిగిన దాడులను రాహుల్ ఎత్తి చూపగా - బీఆర్ అంబేద్కర్ కు తమ హయాంలోనే సరైన గుర్తింపు లభించిందని మోడీ చెప్పుకున్నారు.
ఇదిలాఉండగా...గుజరాత్ ఎన్నికల సందర్భంగా మొదలుపెట్టిన ఆలయాల సందర్శనను కర్ణాటకలోనూ కొనసాగించిన రాహుల్ రాష్ట్రంలో దాదాపు 30 ప్రధాన ఆలయాలు - లింగాయత్ లకు చెందిన మఠాలను సందర్శించారు. రెండేళ్ల తరువాత ఎన్నికల ప్రచారానికి వచ్చిన సోనియాగాంధీ మోడీకి కాంగ్రెస్ ముక్త్ భారత్ భూతం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రచారం ముగింపు దశలో ఒకేచోట పదివేలకు పైగా ఓటరు ఐడీ కార్డులు లభించడం కలకలం రేపింది. అవి నకిలీ కావని ఎన్నికల అధికారులు ధ్రువీకరించడంతో సమస్య సద్దుమణిగింది.
కర్ణాటకలో బీజేపీకి ప్రధాన ఓటుబ్యాంకుగా భావిస్తున్న లింగాయత్ లకు ప్రత్యేక మైనారిటీ హోదా కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని తమ వైపునకు తిప్పుకొనేందుకు ప్రయత్నించింది. అయితే వారు ఏ పార్టీకి అండగా నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కన్నడ భాషకు ప్రాధాన్యం - హిందీని నిరాకరించడం - కర్ణాటకకు ప్రత్యేక జెండా - గత ఐదేళ్ల పాలన - సీఎం సిద్దరామయ్యపై అవినీతి మచ్చలు లేకపోవడం వంటి అంశాలు తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తున్నది. కాగా కేంద్రంలో మోడీ సాగిస్తున్న పాలన - ఇటీవల జరిగిన పలు రాష్ర్టాల ఎన్నికల్లో ప్రజలు తమకు మద్దతునిస్తుండటం కర్ణాటకలో కూడా కొనసాగగలదని బీజేపీ భావిస్తున్నది. అయితే రాష్ట్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదని - హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సర్వేలు అంచనా వేశాయి. జేడీ(ఎస్)కీలకంగా మారి కింగ్‌మేకర్‌గా అవతరించవచ్చని పేర్కొన్నాయి.
మరోవైపు - రేపు కర్ణాటకకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరు బీజేపీ నేతల మధ్య జరిగిన వాట్స్ అప్ చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు బీజేపీ నేతలు సి.టి. రవి - శోభా కరండ్లజి మధ్య వివాస్పదమైన వాట్స్ అప్ చాట్ జరిగింది. కర్ణాకట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.ఎస్. యడ్యూరప్పకు ఎన్నికల విషయంలో స్వేచ్ఛను ఇవ్వనందు వల్లనే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని చవిచూస్తుందని ఆ ఇద్దరు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల అభిప్రాయాన్ని గురించి తన పార్టీ నాయకుడైన శోభాను వాట్స్ అప్ చాట్ లో సి.టి. రవి అడిగాడు. అందుకు సమాధానంగా...``ప్రధాని మోడీ ప్రచార ర్యాలీలు బీజేపీకి అంతగా ఉపయోగపడవు, 2014 లోక్ సభ ఎన్నికల్లో దూకుడుగా ప్రచారం చేసిన మోడీ.. ఇపుడు కర్ణాటకలో ఆ జోష్ కోల్పోయాడు` అని బదులిచ్చింది. ఇంకా సి.టి. రవి అడిగిన ప్రశ్నలకు శోభా సమాధానాలను ఇచ్చారు. వీరి చాట్ ప్రకారం.. ఓటమిని ముందే అంగీకరిస్తున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
మరోవైపు కర్ణాటక శాసనసభ ఎన్నికలకు పోలింగ్ శనివారం జరగనుంది. పోలింగ్ కు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 224 నియోజకవర్గాలకు గానూ 223 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. జయనగర్ బీజేపీ ఎమ్మెల్యే బీఎన్ వినయ్ కుమార్ మే 4న గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆ ఒక్క నియోజకవర్గానికి ఎన్నిక వాయిదా పడింది. మొత్తం ఓటర్ల సంఖ్య 5,06,90,538. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య 2,984. ఇందులో మహిళా అభ్యర్థులు 217 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.