Begin typing your search above and press return to search.

ఇళయరాజాపై బీజేపీకి ఎందుకంత ఇంట్రెస్టు..?

By:  Tupaki Desk   |   19 April 2022 5:30 AM GMT
ఇళయరాజాపై బీజేపీకి ఎందుకంత ఇంట్రెస్టు..?
X
సినీ సంగీతంలో 'మేస్ట్రో' అనిపించుకున్న ఇళయరాజ గురించి తెలుసు. కానీ ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలవలేదు. సంగీతమే ప్రపంచంగా సాగుతున్న ఆయన పేరు రెండు రోజులుగా మారుమోగుతోంది. ఇళయరాజ పెద్దల సభకు వెళ్లనున్నాడని, రాష్ట్రపతి కోటాలో బీజేపీ ఆయనను రాజ్యసభకు తీసుకెళ్లనుందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా కొన్ని పరిణామాలు చూస్తే నిజమనే తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ఇళయరాజ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. ఓ పుస్తకంలో ముందుమాట రాసిన ఆయన మోదీని అంబేద్కర్ తో పోల్చారు. దీనిపై ఓ వైపు నుంచి విమర్శలు వస్తున్నా.. ఆయనకు మాత్రం ప్రయోజనమే జరిగిందని అంటున్నారు. అయితే ఇదంతా బీజేపీ చేస్తున్న ఎత్తుగడలో భాగమని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ ఎప్పటి నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇక్కడి ప్రజలు ప్రాంతీయ పార్టీలకే పట్టం కడుతున్నారు. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఎంతో కొంత ఆశ పెట్టుకున్నా నిరాశే మిగిలిచింది. డీఎంకేకే మద్దు ఇచ్చినా ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో బీజేపీ ప్లాన్ వృథా అయింది.

అయితే ఆ సమయంలో సీనీ ప్రముఖులను వలలో వేసుకునేందుకు వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా ప్రముఖ నటి కుష్బూను పార్టీలో చేర్చుకొని టిక్కెట్ కూడా ఇచ్చారు. కానీ ఆమె ఓటమి చెందారు. అయినా ఆమెకు నామినేటేడ్ పోస్టు ఇచ్చి పార్టీ మారకుండా కాపాడగలిగారు.

మరోవైపు సూపర్ స్టార్ రజనీ కాంత్ ను సైతం బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన సొంత పార్టీతో హడావుడి చేసి ఆ తరువాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తాను ఓ ఓటర్ మాత్రమేనన్నారు. దీంతో బీజేపీ వేసిన స్కెచ్ మరోసారి ఫెయిల్ అయింది.

దీంతో అప్పటి నుంచి సినిమా నటులపై బీజేపీ ఫోకస్ చేస్తూ వస్తోంది. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజాను పార్టీలోకి తీసుకుంటే కలిసొస్తోందని భావిస్తున్నారు. ఆయనకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా తమిళనాడులోనూ ఇళయ రాజాతో బీజేపీ పాగా వేసేందుకు అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు.

తమిళ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఇళయరాజా తెలుగు, ఇతర భాషల్లోనూ సంగీతాన్ని అందించారు.దాదాపు మూడు తరాల వారికి తన పాటలను అందించి మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకున్నారరు. అయితే ఆయన జీవితంలో ఎప్పడూ రాజకీయాల జోలికి వెళ్లలేదు. సినిమా ఇండస్ట్రీలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం ఆసక్తిగా మారుతోంది. మరోవైపు అధికారంలో ఉన్న డీఎంకేను కాదని ఇళయ రాజా రాజ్యసభకు వెళుతాడా..? లేదా..? అనేది చూడాలి.