Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఎందుకు నోరెత్తటం లేదు ?

By:  Tupaki Desk   |   1 July 2021 11:30 AM GMT
చంద్రబాబు ఎందుకు నోరెత్తటం లేదు ?
X
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. దేశంలోనే తనంతటి సీనియర్ నేత లేడంటారు. కానీ ఇంత గొడవ జరుగుతున్నా కనీసం నోరెత్తలేని స్ధితిలో ఉండిపోయారు. ఇదంతా ఎవరి కోసమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణా-ఏపి మధ్య ఇంత గొడవ జరుగుతున్నా చంద్రబాబునాయుడు మాట్లాడే ధైర్యంకూడా చేయలేకపోతున్నారు. శ్రైశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ జలల వినియోగంలో తెలంగాణా మంత్రులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్+జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న విషయం అందరికీ తెలిసిందే.

తెలంగాణాకు రావాల్సిన న్యాయబద్ధమైన జలాలను ఏపి అక్రమంగా తీసేసుకుంటోందనేది తెలంగాణా మంత్రుల ఆరోపణలు. అయితే ఏపికి రావాల్సిన జనాలనే తెలంగాణా వాడుకుంటోందని ఏపి మంత్రులు ఎదురు దాడి మొదలుపెట్టారు. ఒకప్రభుత్వంపై మరొక ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేసుకుంటోంది. అనవసరమే అయినా తెలంగాణా మంత్రలు నోటికొచ్చినట్లు మాట్లాడటం ద్వారా అనవసరమైన ఉద్రిక్తతను సృష్టిస్తున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య ఇంత గొడవ జరుగుతున్నపుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాట్లాడాలి కదా. రెండు రాష్ట్రాల్లో ఎవరిది తప్పో చెప్పగలగాలి కదా. తనకేమీ పట్టన్నట్లు, జరుగుతున్న విషయంలో అసలు ఏపికి సంబందమే లేదన్నట్లుగా చంద్రబాబు అండ్ కో వ్యవహరిస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని పదే పదే తిట్టడానికి లేస్తున్న నోరు జల జగడాల మీద మాట్లాడటానికి మాత్రం నోరు లేవటంలేదు.

ఇపుడే కాదు ఆమధ్య ఏపి నుండి వైద్యంకోసం హైదరాబాద్ కు వచ్చే రోగులను కూడా తెలంగాణా ప్రభుత్వం నిలిపేసింది. కొన్ని వందలమంది రోగులు బార్డర్ గ్రామాల దగ్గరే బాగా ఇబ్బంది పడ్డారు. చివరకు కోర్టు జోక్యంతో సమస్య పరిష్కారమైంది. అయితే క్షేత్రస్ధాయిలో అప్పట్లో ఎంత గొడవలు జరిగినా చంద్రబాబు మాత్రం నోరిప్పలేదు. విచిత్రమేమిటంటే ఇదే సమస్య కొద్దిరోజుల తర్వాత మళ్ళీ మొదలైతే జగన్ చేతకాని తనంవల్లే జనాలను సరిహద్దుల్లో తెలంగాణా ప్రభుత్వం నిలిపేస్తోందంటు మాట్లాడారు.