Begin typing your search above and press return to search.
భారత్ పై చైనా ఎందుకు మండిపడుతోంది? అసలు ఈ గొడవ ఏంటి? మోడీ ఏం చేశాడు?
By: Tupaki Desk | 9 July 2022 11:41 AM GMTఒక్క మోడీ ఫోన్ కాల్ చిచ్చు పెట్టింది. భారత్ పై చైనా ఆగ్రహానికి కారణమైంది. భారత్ పై చైనా ఎందుకు మండిపడింది? అసలు గొడవ ఏంటి ? మోడీ ఏం చేశాడన్నది హాట్ టాపిక్ గా మారింది. బౌద్ధగురువు దలైలామా జన్మదినం సందర్భంగా మోదీ చేసిన ఒక్క ఫోన్ కాల్ మరోసారి చైనాకు కోపం తెచ్చుట్లు చేసిందని కొందరు చర్చించుకుంటున్నారు. మోదీ దలైలామాకు ఫోన్ చేస్తే చైనా ఎందుకు కోపం తెచ్చుకుంటోందన్న ప్రశ్న.?
-భారత్ పై చైనా ఎందుకు మండిపడుతోంది?
బౌద్ధుల గురువు దలైలామా జన్మదినం సందర్భంగా ఆయనకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘాయిష్సుతో ఉండాలని, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే భారత ప్రధాని దలైలామాకు ఫోన్ చేయడంతో చైనా భగ్గుమంది. దలైలామాకు శుభాకాంక్షలు తెలపడంపై చైనా విదేశాంగ మంత్రి జావో లిజాన్ స్పందించారు. చైనా వ్యతిరేక, వేర్పాటు వాదైన దలైలామాకు భారత్ శుభాకాంక్షలు తెలపవచ్చని, కానీ టిబెట్ విషయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని అన్నారు. అంతేకాకుండా టిబెట్ ను అడ్డంపెట్టుకొని చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.
-టిబెట్ సమస్య ఏంటి? మోడీ ఏం చేశాడు? ఈ గొడవకు కారణమేంటి?
దలైలామా 1959లో టిబెట్ నుంచి భారత్ కు వచ్చారు. అప్పటి నుంచి ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో బౌద్ధ ఆశ్రమంలో ఉన్నారు. టిబెట్ మాత్రం చైనా ఆధీనంలోకి వెళ్లిపోయింది. అయితే దలైలామా చైనాకు వ్యతిరేకి. ఆయన వేర్పాటు వాది అని వాదిస్తోంది. అయితే దలైలామా భారత్ లో ఉన్నా ఆయన కార్యకలాపాలను నిత్యం పర్యవేక్షిస్తోంది. ఈ తరుణంలో దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలపడం కచ్చితంగా చైనాను రెచ్చగొట్టడమేనని ఆ దేశ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానిస్తున్నారు. మోడీ ఫోన్ చేసి దలైలామాకు శుభాకాంక్షలు తెలుపడమే ఈ గొడవకు కారనంగా చెబుతున్నారు.
-టిబెట్ వర్సెస్ చైనా వర్సెస్ ఇండియా..
హిమాలయాల అవతల మన భారత్ కు ఆనుకొని ఉండే టిబెట్ వాసులు ఆది నుంచి చైనా నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు.కానీ చైనా దీన్ని అడుగడుగునా అణిచివేస్తోంది. టిబెటన్ల మత గురువు దలైలామాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంతో భారత్ పై కక్ష పెంచుకుంది చైనా. టిబెటన్లపై ఉక్కుపాదం మోపుతున్న చైనాకు వ్యతిరేకంగా భారత్ కు వచ్చి దలైలామా ఆశ్రయం పొందుతున్నాడు.
భారత్ లో లక్షల మంది టిబెటియన్లు నివసిస్తున్నారు. 2010 నుంచి టిబెట్, చైనాల మధ్య చర్చలు నిలిచిపోయాయి. చైనా నాయకులు భారత్ కు వచ్చినప్పుడల్లా టిబెట్ ప్రజలతో మాట్లాడాలని వారు ఒత్తిడి తెస్తున్నారు. చైనా నిషేధించిన టిబెటన్ల గురువు దలైలామాకు ఆశ్రయం ఇవ్వడమే చైనా కోపానికి కారణం. చైనా వేర్పాటువాద నాయకుడికి భారత్ ఆశ్రయం ఇస్తుందన్న కోపం చైనాకు ఉంది. అందుకే టిబెట్లను భారత్ కు మద్దతుగా ఉంటే చైనా మండిపడుతోంది. ఈ వార్ చైనా వర్సెస్ ఇండియా మధ్య పరోక్ష ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
-ఇప్పటికే గాల్వాన్ లోయలో ఘర్షణ.. ఇప్పుడు మరోసారి..
భారత్-చైనాల మధ్య మరోసారి ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో గాల్వామా ఘటనలో రెచ్చిపోయిన చైనీయులు భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఆ తరువాత భారత సైన్యం తిరుగుబాటుతో పాటు దేశీయంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు చైనా తోకముడిచేటట్లు చేశాయి. ఇప్పుడు మరోసారి దలైలామాకు మోడీ ఫోన్ తో రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టినట్టైంది.