Begin typing your search above and press return to search.

అటు తిరిగి.. ఇటు తిరిగి చిరంజీవిపై పడ్డారే..

By:  Tupaki Desk   |   7 Jan 2018 7:09 AM GMT
అటు తిరిగి.. ఇటు తిరిగి చిరంజీవిపై పడ్డారే..
X
సినిమా వాళ్లకు రాజకీయాలేంటి అన్న వాళ్లకు దిమ్మదిరిగే సమాధానం చెప్పాడు నందమూరి తారకరామారావు. ఆయన రాజకీయాల్లో సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన రాకతో సినిమా వాళ్లను అంత తేలిగ్గా తీసుకోకూడదని రాజకీయ నాయకులందరికీ అర్థమైంది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్లకు ఒక రోల్ మోడల్ గా నిలిచిపోయారాయన. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇదే కోవలో రాజకీయారంగేట్రం చేశారు. కానీ ఎన్టీఆర్ లాగా ఈ రంగంలో విజయవంతం కాలేకపోయారు. దీంతో చిరును ఒక ఫెయిల్యూర్ మోడల్ గా చూపించడానికి వాడుకుంటున్నారు జనాలు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తమిళనాట కూడా చిరు పేరు ఈ విషయంలో చర్చనీయాంశమవుతుండటం విశేషం. ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై దాడికి చిరును ఉదాహరణగా చూపించే ప్రయత్నం చేస్తోంది డీఎంకే పార్టీ. ఆ పార్టీ మద్దతుతో నడిచే ఒక పత్రికలో రజినీ రాజకీయారంగేట్రంపై ఒక ఆర్టికల్ రాశారు. అందులో చిరు ప్రస్తావన ఉంది. చిరు ఏవేవో కలలతో రాజకీయ పార్టీ పెట్టి ఎలా విఫలమైంది అందులో వివరిస్తూ.. రజినీ కూడా అలాగే అయ్యే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. ఐతే ఎన్టీఆర్ విషయంలో జరిగినట్లు చిరు విషయంలో జరగలేదు. అలాగే చిరు విషయంలో జరిగినట్లు మరొకరి విషయంలో జరుగుతుందని ఎలా అనుకుంటాం..? కాబట్టి రజినీ రాజకీయాల్లో విజయవంతం కావచ్చేమో. ఏదేమైనా మన చిరు పేరు ఈ రకంగా తమిళనాడు మీడియాలో రావడం ఆయన అభిమానులు బాధ కలిగించే విషయమే.