Begin typing your search above and press return to search.
ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఆ మాజీ సీఎం మనమరాలికి ఎందుకొచ్చింది?
By: Tupaki Desk | 29 Jan 2022 6:30 AM GMTచేతిలో అధికారం..పిలిస్తే పలికే వేలాదిమంది కార్యకర్తలు.. మంది.. మార్బలం.. ఇలా దేనికి లోటు లేని జీవితంలో ఉన్న వారికి ఆత్మహత్య చేసుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంటారు? బతకలేక.. బతికే దారి లేక.. సమస్యల సుడిగుండంలోనూ.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయి.. మరో దారి తోచక ఆత్మహత్య చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అందుకు భిన్నంగా అన్ని అందుబాటులో ఉండి.. తనకు తాను వైద్యురాలు అయి ఉండి.. 30ఏళ్ల చిరు ప్రాయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న పెద్ద కష్టం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మనమరాలు డాక్టర్ సౌందర్యకు ఎందుకు వచ్చింది? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
మూడేళ్ల క్రితమే డాక్టర్ నీరజ్ ను పెళ్లాడి.. తొమ్మిది నెలల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంట్లో ఉంటున్న ఆమె.. ఇంతటి దారుణానికి ఎందుకు తెగబడింది? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెద్దింటోళ్ల అమ్మాయిగా ఆమెకు ఎలాంటి కష్టం వచ్చి పడిందన్న చర్చ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఆమె ఆత్మహత్య కర్ణాటకలో ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఉన్నత ఆదాయ వర్గాల్లో కలకలాన్ని రేపుతోంది. ఎవరికి వారు ఈ ఉదంతాన్ని విశ్లేషించే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె కుటుంబ సభ్యులు మొదలు.. బంధువులు.. తెలిసిన వారెవరూ కూడా ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సినంత పెద్ద సమస్యలు లేవని చెబుతున్నారు. అయినప్పటికి ఆమె ఇంతటి బలమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం లభించటం లేదు.
కొందరి అంచనా ప్రకారం చూస్తే.. బిడ్డకుజన్మనిచ్చిన తర్వాత అత్యధిక భాగం ఇంట్లో ఉండిపోవాల్సి రావటం.. లాక్ డౌన్ కారణంగా బయటకు వెళ్లకపోవటం కూడా ఆమె ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. ఎక్కువసేపు ఒంటరితనంతో గడపటంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఉంటారన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. యడ్డీని ప్రధాని నరేంద్ర మోడీ.. మాజీ ప్రధాని దేవేగౌడ.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ్ తదితరులు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.
యడ్డీ కుమార్తె పద్మావతి పుత్రికే ఈ సౌందర్య. ఆమె అంటే.. యడ్డీకి చాలా చాలా ఇష్టమని చెబుతారు. అదే సమయంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడా సౌందర్యను తన మనమరాలిగా చెప్పుకునే వారు కాదు. అలా చెబితే.. ఆమెకు ప్రాధాన్యతను ఇచ్చి.. దూరంగా ఉంటారన్న ఉద్దేశంతో ఆమె మీద తన ట్యాగ్ పడకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇక.. సౌందర్యకు కొండంత అండగా ఇద్దరు మేనమామలు ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండటం.. కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకున్నా.. సౌందర్య ఆత్మహత్య చేసుకోవటం ఎవరికి మింగుడుపడటం లేదు. స్వతహాగా వైద్యురాలు ఉండి కూడా అర్థాంతరంగా జీవితాన్ని ముగించేయాలన్న పెద్ద కష్టం ఏమిటన్నది అర్థం కాని పరిస్థితి. అయితే.. ఇంట్లో ఒక్కతే ఒంటరిగా ఉండటం.. ఆ ఒంటరితనాన్ని భరించలేక సూసైడ్ చేసుకొని ఉంటారేమో? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.