Begin typing your search above and press return to search.
జులై 1నే డాక్టర్స్ డే ఎందుకు? మోడీ ఏం చెప్పారు?
By: Tupaki Desk | 1 July 2021 5:30 AM GMTడాక్టర్లను దేవుళ్లతో పోలుస్తారు.. మన ప్రాణాలను రక్షించే వారికి సమాజంలో ఆ గౌరవం ఉంది. కరోనా కల్లోలంలో అయితే తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా వైద్యులు చేసిన సహాసాలు అన్నీ ఇన్నీకావు.. వారికి రెండు చేతులు ఎత్తి మొక్కినా తక్కువే.. ప్రస్తుత కరోనా విలయతాండవంలో వైద్యులు , మెడికల్ సిబ్బంది అందిస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు.. జూన్ 1న జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకుందాం.. ప్రధాని మోడీ ఈరోజున వైద్య సిబ్బందిని ఉద్దేశించి కీలక సందేహం ఇవ్వనున్నారు.
- దేశంలో డాక్టర్స్ డే ఎలా మొదలైంది?
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీర్మానం మేరకు 1991 నుంచి ఏటా జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మన దేశంలో ప్రతి ఏటా జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. భారత రత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి సందర్భంగా ఈ రోజును డాక్టర్స్ డేగా జరుపుకునే సంప్రదాయం వచ్చింది. ఆయన చేసిన సేవలకు గాను మూడు దశాబ్ధాలుగా ఇది కొనసాగుతోంది.
-ఎవరీ బిధాన్ చంద్రరాయ్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి బిధాన్ చంద్రరాయ్. బెంగాల్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1961 ఫిబ్రవరి 4న భారత ప్రభుత్వం డాక్టర్ రాయ్ కు దేశ అత్యున్నత పౌరపురస్కారం, భారతరత్నతో సత్కరించింది. దేశంలో వైద్యరంగం విస్తృతికి కృషి చేసిన ఆయన జయంతినే జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు.
-ఈరోజున ఏం చేస్తారు?
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సమాజంలో డాక్టర్లు చేస్తున్న సేవలు, కృషి గురించి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చర్చ జరగడం.. వైద్యులకు గ్రీటింగ్స్ తెలుపుతుంటారు.ర్యాలీలు, సభలు కూడా కొనసాగుతాయి. కానీ ఈ సారి కరోనా కారణంగా ఈ ఏడాది కూడా డాక్టర్స్ డే నిరాడంబరంగా జరుగనుంది. కరోనాతో చనిపోయిన వేలాది మంది డాక్టర్లకు నివాళులర్పించనున్నారు.
-మోడీ ఈరోజు ప్రసంగం
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశంలో కరోనా కల్లోలం గొప్ప సేవ చేసిన వైద్యులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్వహిస్తోన్న కార్యక్రమంలో మధ్యాహ్నం 3 గంటలకే మోడీ ప్రసంగిస్తారు.
ఇక ప్రపంచంలోని ఇతర దేశాల్లో వేర్వేరు తేదీల్లో ఈ డాక్టర్స్ డేను జరుపుతారు. అమెరికాలో అయితే మార్చి30న ఈ డే నిర్వహిస్తారు. క్యూబాలో డిసెంబర్ 3న, ఇరాన్ లో ఆగస్టు 23న ఇలా డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహిస్తారు.