Begin typing your search above and press return to search.
కావ్యా మారన్ నవ్వు ఇప్పుడు హాట్ టాపిక్ ఎందుకు?
By: Tupaki Desk | 18 April 2022 5:05 AM GMTకాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిరంతరం ప్రయత్నం చేస్తుండాలే కానీ అసాధ్యం అంటూ ఏమీ ఉండదన్న విషయాన్ని ప్రయత్నపూర్వకంగా నిరూపిస్తోంది కావ్యా మారన్. మామూలు వారికి ఆమె పేరు చెప్పిన వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. ఐపీఎల్ ను ఫాలో అయ్యే వారికి మాత్రం ఆమె సుపరిచితురాలు. ఐపీఎల్ లో ఆడే జట్లలో ఏదో ఒకదానిని అభిమానించే వారు సైతం.. కావ్యా మారన్ ముఖంలో నవ్వు కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇప్పుడా సమయం వచ్చేసింది. ఆమె ముఖం నవ్వులతో కొత్త వెలుగుల్ని నింపుతోంది. ఇంతకూ కావ్యా మారన్ ఎవరంటారా? సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కుమార్తె.
గత ఐపీఎల్ సీజన్ లో ఆమె జట్టు వరుస ఓటముల కారణంగా.. ఆమె ముఖంలో నవ్వు మాయమైంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం మరొకటి ఉంది. కావ్యా ముఖంలో నవ్వుకు అంత ప్రాధాన్యత ఎందుకు? అన్న సందేహం కలగొచ్చు. దానికి కారణం లేకపోలేదు.
ఐపీఎల్ జట్లలో చాలామంది యజమానులకు భిన్నంగా కావ్యా మాత్రం.. ప్రతి మ్యాచ్ ను పక్కాగా ఫాలో కావటమే కాదు.. స్టేడియంలో ఉండి మరీ.. తన జట్టు సభ్యుల్ని ఉత్సాహపరుస్తుంటుంది. ఇంత కష్టపడినప్పటికీ.. ఆమె జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా ఓడిపోవటం.. అలాంటి ప్రతిసారీ ఆమె ముఖం వాడిపోవటం మామూలే.
గత సీజన్ లో వరుస పరాజయాలతో సన్ రైజర్స్ చతికిలపడటం.. ఆ సందర్భంగా ఆమె ముఖంలో నవ్వు లేకుండా పోయింది. తాజాగా నిర్వహించిన బిడ్ లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె.. జట్టు సభ్యుల ఎంపిక మొత్తాన్ని అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరించి నీర్ణయం తీసుకుంది. ఆమె ఎంపిక మీద పెద్ద ఎత్తున ట్రోల్స్.. మీమ్స్ సర్య్కులేట్ అయ్యాయి. అయితే.. ఆత్మవిశ్వాసంతో తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు ఆమె అనుకున్నట్లు జట్టు కుదురుకోవటంతో పాటు.. ఆశ్చర్యకర రీతిలో విజయాల్ని సాధిస్తోంది.
మొదటి రెండు మ్యాచుల్లో ఓటమి పాలైనప్పటికీ.. ఆ తర్వాత నుంచి పుంజుకున్న జట్టు.. ఇప్పుడు చెలరేగిపోతోంది. వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళుతోంది. ఇదే రీతిలో జట్టు తీరు ఉంటే.. ఈసారి ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.
జట్టు ఓడిన ప్రతిసారీ లైవ్ లో ఆమె వాడిన ముఖాన్ని చూసిన వారంతా.. అయ్యో.. కావ్యా నవ్వితే చూడాలన్న మాట పలువురి నోటి వెంట వచ్చేది. అంతలా ఆమె కదిలించింది. అందరి ప్రార్థనలు ఫలించటం కానీ.. జట్టు ప్రదర్శిస్తున్న ఆట తీరుతో వస్తున్న విజయాలు కావ్యా ముఖంలో నవ్వులు విరబూస్తున్నాయి. ఆమె నవ్వులు ఈ సీజన్ మొత్తం ఆమె వెంటే ఉండాలని ఆశిద్దాం.