Begin typing your search above and press return to search.

మంగళగిరి... ఎందుకు టార్గెట్ అయ్యింది?

By:  Tupaki Desk   |   21 July 2022 1:30 AM GMT
మంగళగిరి... ఎందుకు టార్గెట్ అయ్యింది?
X
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేత‌ల మ‌ధ్య ఇటీవ‌ల కాలంలో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్‌గా మారింది. స్వ‌యానా చంద్ర‌బాబు కూడా.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంపై త‌ర‌చుగా.. స‌మీక్ష‌లు చేస్తున్నారు. పైకి మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డ ఏం జ‌రుగుతోంది.. ? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీ ఎలా పుంజుకోవాలి.? ప్ర‌స్తుతం పార్టీ ప‌రిస్థితి ఏంటి? అనే విష‌యాల‌పై ఆయ‌న దృష్టి పెట్టారు. మ‌రోవైపు.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడి మాదిరిగా నారా లోకేష్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ నుంచే పోటీ చేస్తాన‌ని చెప్పారు.

అయితే.. ఇదేదో.. ఆయ‌న నోటి మాట‌గా చెప్ప‌డం కాదు.. చేత‌ల్లోనూ చూపిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్క‌డ‌మే ల‌క్ష్యంగా దూసుకుపోతున్నారు. ప్ర‌తి రెండు మాసాల‌కు ఒక‌సారి..(గ‌డిచిన ఆరుమా సాల్లో) మంగ‌ళ‌గిరిలో ప‌ర్య‌టిస్తు న్నారు.

ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. ముఖ్యంగా చేనేత‌, హాక‌ర్స్‌, తోపుడు బండ్ల వాళ్లు.. ఇలా.. కీల‌క‌మైన మాస్ జ‌నానికి ఆయ‌న చేరువ అవుతున్నారు. వారి ఇబ్బందులు తెలుసుకుంటున్నారు ఆర్థికంగా సాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్క‌డ‌.. చెక్క సెంట్రింగ్ ప‌నిపై జీవనం సాగించేవారు ఎక్కువ‌గా ఉన్నారు.

ఇక్క‌డ త‌యార‌య్యే తోపుడు బండ్ల‌కు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీనిని దృస్టిలో పెట్టుకుని.. ఆయా బ‌ళ్ల‌కు అయ్యే ధ‌ర‌ల‌ను టీడీపీ నిధుల నుంచి కేటాయించి.. ఉచితంగా .. చేతి వృత్తుల వారికి తోపుడు బ‌ళ్ల వారికి నియోజ‌క‌వ‌ర్గాల వారిగా పంపిణీ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 50 నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు.. ఇక్క‌డ తోపుడు బండ్ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చారు.ఇ క‌, నియోజ‌క‌వ‌ర్గంలోనే పార్టీ జెండాలు.. త‌యారు చేయిస్తున్నారు. దీనివ‌ల్ల చేనేత‌ల‌కు ప‌నులు పుష్క‌లంగా ల‌బిస్తున్నాయి. ఇదంతా కూడా స్థానికంగా యువ‌త‌కు ఉపాధి చూపుతోంది.

అయితే.. ఈ కార్య‌క్ర‌మాల ద్వారా.. త‌న ఉన్న‌తిని కూడా లోకేష్ చూసుకుంటున్నారు. నిరంత‌రం వారిని క‌లుస్తున్నారు. ప‌ట్టాలు లేని వారి ఇళ్ల‌కు ప‌ట్టాలు ఇస్తామ‌ని.. చేనేత‌ల‌కు మ‌రింత మెరుగైన ధ‌ర‌లు వ‌చ్చే లా చూస్తామ‌ని.. హామీలు ఇస్తున్నారు. దీంతో లోకేష్ చేస్తున్న ప‌నులు.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా ఆద‌ర్శంగా మారుతున్నాయి. పైగా.. వ‌చ్చే ఎన్నిక‌లకు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉన్నందున‌.. ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత చేసేందుకు ప్ర‌చారానికి కూడా గ్యాప్‌, స్కోపు రెండు ఉండ‌డం లోకేష్‌కు క‌లిసి వ‌స్తోంద‌ని.. టీడీపీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకే ఇప్పుడు మంగ‌ళ‌గిరి టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది.