Begin typing your search above and press return to search.
అమావాస్య చంద్రుడు మన పవన్ ఎక్కడ?
By: Tupaki Desk | 7 Jan 2020 6:57 AM GMTరాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి.. అందుకే రాజకీయాల్లో ఉన్నప్పుడు కాసింత నేర్పరితనం.. కలివిడితనం.. కలుపుగోలుతనం అవసరం.. ఓడినా గెలిచినా ప్రజల్లో ఉన్నప్పుడే వారికి నమ్మకం కలుగుతుంది.. అప్పుడే మనల్ని గెలిపిస్తారు. ఈ లాజిక్ మిస్ అవ్వుతున్నాడు కాబట్టే పవన్ కళ్యాణ్ పరుషంగా ముందుకెళ్తున్నా ఆయనకు ఓట్లు పడడం లేదు.. పవన్ దెబ్బై పోతుంది ఇక్కడేనని రాజకీయ విశ్లేషకులు ఘంఠాపథంగా చెబుతున్నారు.
అమావాస్య చంద్రుడు మన జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. మొన్నటికి మొన్న అమరావతి రాజధాని రైతుల పోరాటానికి మద్దతుగా ముళ్లకంచెలు బద్దలు కొట్టి మరీ 9 కి.మీలు నడిచి వెళ్లిన పవన్ ను చూసి ఏదో చేస్తాడని జనసేన కార్యకర్తలు, అమరావతి రైతుల గంపెడాశలు పెట్టుకున్నారు. అమావాస్యకు, పౌర్ణమికి మాత్రమే కనిపించేలా పవన్ రాజకీయాలున్నాయంటున్నారు. అమరావతి లో ఆరోజు హల్ చల్ చేసిన పవన్ మళ్లీ ఇంత వరకూ ఏపీ రాజకీయ తెరపై కనిపించ లేదు.
పార్ట్ టైం పాలిటిక్స్ పవన్ కు బాగా అలవాటైపోయిందని రాజకీయాల్లో సెటైర్లు పడుతున్నాయి.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడడం.. నిప్పు రాజేయడం.. తర్వాత కనిపించకుండా పోవడం.. ఇప్పుడు ఇదే పవన్ పాలి‘ట్రిక్స్’ అని అందరూ ఎద్దేవా చేస్తున్నారు.
పవన్ పార్ట్ టైం పాలిటిక్స్ తో జనసైనికుల్లో నైరాశ్యం కనిపిస్తోందంటున్నారు.. ఎన్నికలకు ముందు కూడా 10 రోజులు విస్తృతంగా ప్రచారం చేసి వార్తల్లో నిలిచి పవన్ మరో 15 రోజుల పాటు కనిపించకుండా పోయేవారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా ఓటమిపై రివ్యూ చేసి మన టార్గెట్ ఐదేళ్లు కాదు.. 25 ఏళ్లు పాలిటిక్స్ లో ఉండి అధికారమే లక్ష్యంగా పనిచేస్తానని పవన్ స్పష్టం చేశారు.ఈ ఓటమితో కృంగిపోనని చెప్పాడు. అయితే ఏపీలో సమస్యల పై ఒక్కసారిగా బరస్ట్ కావడం. తర్వాత సైలెంట్ అయిపోవడం తరుచుగా కనిపిస్తోంది. ఏపీ రాజధాని విషయంలో పవన్ తప్పటడుగులు వేస్తున్నారు. అటు అమరావతి రైతుల రాజధానికి మద్దతు అంటున్నారు. మరో వైపు వారితో కలిసి పోరాడడం లేదు. మూడు రాజధానులకు వ్యతిరేకమంటూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు.
ఉవ్వెత్తున ఎగిసిపడడం.. మళ్లీ చప్పున చల్లారడం పవన్ కళ్యాణ్ కు అలవాటుగా మారిపోయిందని జనసైనికులూ ఆవేదన చెందుతున్నారు. రాజకీయాలను పార్ట్ టైంగా చూసుకుంటూ పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టను పోగొట్టుకుంటున్నారడనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ మళ్లీ సైలెంట్ అవ్వడాన్ని జనసైనికులు తట్టుకోలేకపోతున్నారు.