Begin typing your search above and press return to search.
మంత్రుల రాజీనామా పై టీడీపీ ఎందుకు ఉలిక్కిపడుతోంది ?
By: Tupaki Desk | 9 April 2022 8:40 AM GMTమంత్రుల రాజీనామా విషయం పూర్తిగా ముఖ్యమంత్రికి, అధికారపార్టీకి సంబంధించిన అంతర్గత విషయం. ఇపుడు వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులంతా రాజీనామాలు చేసారు. 11వ తేదీన కొత్తమంత్రివర్గం ఏర్పాటవుతుందని ప్రచారం జరుగుతోంది. మంత్రులందరినీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తొలగించారు ? కొత్తగా ఎవరెవరిని తీసుకుంటారనేది పూర్తిగా జగన్ ఇష్టమే అనటంలో సందేహంలేదు.
కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకోవటంలో జగన్ అనేక సామాజికవర్గం సమతూకంతో పాటు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని కసరత్తు చేస్తున్నారు. పూర్తిగా అధికారపార్టీ అంతర్గత విషయం అనితెలిసీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ ఎందుకు అతిగా జోక్యం చేసుకుంటోందో అర్ధం కావటంలేదు. మంత్రివర్గ ప్రమాణస్వీకారం తర్వాత కొత్త మంత్రుల ప్లస్సులు, మైనస్సులపై టీడీపీతో పాటు ప్రతిపక్షాలు భేరీజువేసినా అర్ధముంది.
అంతవరకు ఆగకుండా రాజీనామాలు చేసిన మంత్రుల విషయంలో టీడీపీ పదే పదే మాట్లాడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. నారా లోకేష్ మాట్లాడుతు రాజీనామాలు చేసిన మంత్రులు మూడేళ్ళు ఏమి పీకారంటు విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు.
అలాగే కొత్తగా రాబోయే మంత్రులు ఏమి పీకుతారంటు లోకేష్ ప్రశ్నించటమే ఆశ్చర్యంగా ఉంది. రాజీనామాలు చేసిన మంత్రులు ఏమి పీకారు ? కొత్తగా బాధ్యతలు తీసుకోబోయే మంత్రులు ఏమి పీకుతారని లోకేష్ అడగటంలో అర్ధమేలేదు.
లోకేష్ వ్యాఖ్యలే నిజమనుకుంటే మరి చంద్రబాబునాయుడు మంత్రివర్గం ఐదేళ్ళు ఏమి పీకిందనే ప్రశ్నవస్తుంది. టీడీపీ ఎంఎల్సీ గుమ్మడి సంధ్యారాణి లేదా ఇతర నేతలు చేయటానికి ఏమీలేకే మంత్రులంతా రాజీనామాలు చేశారంటు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. మంత్రుల రాజీనామాలంతా నాటకాలంటు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అనటమే ఆశ్చర్యంగా ఉంది.
చంద్రబాబు హయాంలో కూడా మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ జరిగింది. అప్పుడు మంత్రులను ఎందుకు మార్చారంటు ప్రతిపక్షాలేవీ ప్రశ్నించలేదు. ఎందుకంటే మంత్రివర్గం ఏర్పాటు, మార్పులు, చేర్పులనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టం. పైగా అది అధికారపార్టీ అంతర్గత వ్యవహారం. కాబట్టి మంత్రివర్గం మార్పులపై టీడీపీ ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.