Begin typing your search above and press return to search.
మోడీని జగన్ ఎందుకు కలిశారో చెప్పాలంటున్న బాబు
By: Tupaki Desk | 13 May 2017 5:43 PM GMTతన అమెరికా పర్యటన గురించి మీడియాకు వివరించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సమయంలో తాను ఎదుర్కున్న ఇబ్బందుల గురించి ఏకరువు పెట్టారు. అమెరికా పర్యటనలో అక్కడి పోలీసులకు ఫిర్యాదు రావడం, ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలవడం వంటి పరిణామాల పట్ల చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. అమెరికాలో రాత్రిళ్లు నిద్రపోకుండా కష్టపడ్డానని అయితే కొందరు తప్పుడు ఈమెయిల్స్ పెట్టి పరువుతీసే ప్రయత్నం చేశారని చంద్రబాబునాయుడు మండిపడ్డారు. తనను కూడా అక్కడ పోలీసులు పక్కకు లాగేశారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి పార్టీల విషయంలో ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు.
ప్రధానమంత్రిని వైఎస్ జగన్ ఎందుకు కలిశారో చెప్పలేదని చంద్రబాబు తప్పుపట్టారు. `` ప్రత్యేక హోదా విషయంలో తాను తప్పు చేసినట్టు మాట్లాడారు. తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ప్రకటించారు. మడమ తిప్పేదే లేదన్నవారు, ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తామన్నావారు.. ఇప్పుడేం చేస్తున్నారు? జగన్ ప్రధానిని ఎందుకు కలిశారో ఇప్పటి వరకు చెప్పలేదు, ఏం సాధించారో చెప్పాలి. అసలు జగన్ లాంటి వారి స్పూర్తిగా విశాఖలో హవాలా తరహా ఘోరాలు జరుగుతున్నాయి``అని బాబు వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో మొదటి రోజు నుంచీ ఎంతో కష్టపడ్డానని, తనపై తప్పుడు మెయిల్స్ పంపారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
కాగా అమెరికా పర్యటనలో రాష్ట్రం కోసం తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని చంద్రబాబు తెలిపారు. గూగుల్ ఎక్స్, యాపిల్, టెస్లా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, సిస్కో సంస్థలతో సమావేశమయ్యానని చెప్పారు. ప్లెక్స్‌ట్రాన్సిక్స్, ఏఆర్‌ఎం హోల్డింగ్స్ వంటి అగ్రశేణి సంస్థలతో కూడా సమావేశమయ్యానన్నారు. సిస్కో అధినేత జాన్ ఛాంబర్స్ 30 ఏళ్ల క్రితం నాతో కలిసి తీసుకున్న ఫోటో చూపించారని బాబు వివరించారు. క్లౌడ్ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. క్లౌడ్ మేనేజ్‌మెంట్‌లో సహకరానికి న్యూటనిక్స్ ముందుకు వచ్చిందని తెలిపారు. ఒక నెలలో రోడ్ మ్యాప్ తీసుకువస్తామని న్యూటనిక్స్ చెప్పిందని బాబు వివరించారు.