Begin typing your search above and press return to search.
వైఎస్ బాటలో జగన్ నడవరు ఎందుకు?
By: Tupaki Desk | 16 Nov 2022 11:30 PM GMTఏపీలో పరిస్థితుల గురించి తరచూ ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ అధినేత తీరు కూడా దీనికి కారణంగా పలువురు విమర్శిస్తుంటారు. బంపర్ మెజార్టీ వచ్చిన వేళ.. పాలన మీద ఫోకస్ చేసి.. రాష్ట్ర డెవలప్ మెంట్ మీద సీఎం జగన్ కానీ కాస్తంత ప్రత్యేకశ్రద్ధను ప్రదర్శించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేసి.. చంద్రబాబుకు పేరు వస్తుందన్న విషయాన్ని పక్కన పెట్టి.. ఏ రీతిలో అయితే హైదరాబాద్ లో ఐటీని తర్వాతి స్థాయికి తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు వ్యవహరించారో.. అదే పని జగన్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు.
దాదాపు తొమ్మిదిన్నరేళ్లకు పైనే ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు.. అప్పట్లో ఏపీ రాజధాని హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చేందుకు పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తుంటారు. పలు కంపెనీల అధినేతలు చంద్రబాబు కష్టాన్ని తరచూ ప్రస్తావిస్తుంటారు. వారే కాదు.. కీలక స్థానాల్లో ఉన్న వారు సైతం హైదరాబాద్ ను ఐటీ కేంద్రంగా మార్చే విషయంలోనూ.. ఏపీ యువత ఐటీ రంగాన్ని ఎంచుకునేలా ఆయన చేసిన ప్రయత్నాలకు ఫలితాలు ఇప్పటికే వచ్చేయటం.. వాటి ఫలాల్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుభవిస్తున్న వైనం తెలిసిందే.
చాలా మంది ఈ మొత్తం ఎపిసోడ్ లో క్రెడిట్ మొత్తాన్ని చంద్రబాబుకు ఇస్తుంటారు. కానీ.. ఆయనకు క్రెడిట్ ఇచ్చినట్లే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఎందుకంటే.. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చేందుకు చంద్రబాబు పడాల్సిన కష్టమంతా పడి.. ఒక షేప్ కు తీసుకొచ్చే వేళలో.. ఆయన చేతి నుంచి అధికారం చేజారింది. ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్న వైఎస్.. ఐటీకి చంద్రబాబు హయాంలో మాదిరే పెద్దపీట వేయటంతో పాటు.. దాని వేళ్లు మరింత లోతుల్లోకి దిగేలా నిర్ణయాలు తీసుకున్నారు.
ఇవాల్టి రోజున సైబరాబాద్ కమిషనరేట్ పరిదిలోని డెవలప్ మెంట్.. కంపెనీలు రావటం చూస్తే.. చంద్రబాబు నాటిన మొక్కల్ని.. చక్కటి ఐటీ ఉద్యాన వనంగా మార్చటానికి అవసరమైన జాగ్రత్తల్ని వైఎస్ తీసుకోవటం వల్లనే జరిగిందని చెబుతున్నారు. నిజానికి వైఎస్ కు హైదరాబాద్ ఐటీని తర్వాతి స్థాయికి తీసుకెళ్లారన్న క్రెడిట్ రావాల్సి ఉన్నా.. దాని మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. కాంగ్రెస్ నేతలు సైతం కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవటంలో వెనుకపడ్డారని చెప్పాలి.
వైఎస్ వ్యవమరించినట్లే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో వ్యవహరించి ఉండి ఉంటే.. ఈ రోజున ఏపీ పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. అప్పట్లో హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చాలన్న చంద్రబాబు ఆలోచనతో తనకు ఇమేజ్ రాకుండా పోతుందన్న వైఖరితో వైఎస్ డిస్ట్రబ్ చేసి ఉంటే.. ఈ రోజున హైదరాబాద్ లో ఐటీ రంగం ఈ స్థాయిలో ఉండేది కాదన్నది మర్చిపోకూడదు.
అదే రీతిలో చంద్రబాబు మొదలు పెట్టిన ఏపీ రాజధాని అమరావతిని తర్వాతి లెవల్ కు తీసుకెళ్లి ఉంటే.. ఏపీ డెవలప్ కావటంతో పాటు.. జగన్ పాలనా విధానంపై పాజిటివ్ గా ఉండేదన్న మాట వినిపిస్తోంది. తన తండ్రి గురించి.. తన తండ్రి నడిచిన బాట గురించి తరచూ చెప్పే జగన్.. ప్రాక్టికల్ గా మాత్రం ఆయన నడిచిన దారిని నడిచే విషయంలో యువనేత అంతగా ఇష్టపడరన్న మాట వినిపిస్తుంటుంది. అందుకు తగ్గట్లే.. ఆయన పాలనావిధానం కళ్లకు కట్టినట్లుగా ఉందన్నమాట పలువురి నోట రావటం తెలిసిందే. ఏమైనా.. హైదరాబాద్ మహానగరానికి ఉన్న లక్.. అమరావతికి లేదని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.