Begin typing your search above and press return to search.
జగన్ కొత్తింటి గృహప్రవేశం వాయిదా..కారణం ఇదే!
By: Tupaki Desk | 12 Feb 2019 5:16 PM GMTఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట జరగాల్సిన కార్యక్రమం ఒకటి వాయిదా పడింది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న జగన్ ఏపీ రాజధాని అమరావతిలో ఇంటిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి కొత్తింటికి చేరటం ద్వారా.. అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాల్ని నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు.
ఇందులో భాగంగా నిర్మించిన కొత్తింటి గృహప్రవేశం కార్యక్రమాన్ని ఈ నెల 14న చేపట్టాలని భావించారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యుల్ని జగన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందులో భాగంగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించటం.. అందుకు ఆయన ఓకే అనటం జరిగింది. అయితే.. ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం వాయిదా పడినట్లుగా పార్టీ సీనియర్ నేత సుబ్బారెడ్డి వెల్లడించారు.
జగన్ సోదరి షర్మిల.. ఆమె భర్త అనిల్ ఇద్దరి ఆరోగ్యం సరిగా లేదని.. జ్వరంతో బాధ పడుతున్న నేపథ్యంలో గృహ ప్రవేశకార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసినట్లుగా పేర్కొన్నారు. దీనిపై మరింత మాట్లాడేందుకు జగన్ ఇష్టపడటం లేదని తెలిసిందే. మళ్లీ గృహప్రవేశ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంపై ప్రకటన విడుదల చేస్తారని సుబ్బారెడ్డి వెల్లడించారు. తాజాగా చోటు చేసుకున్న మార్పుతో కేసీఆర్ బెజవాడ ప్రోగ్రాం క్యాన్సిల్ అయినట్లే.