Begin typing your search above and press return to search.

ఓటరు దినోత్సవం రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు..?

By:  Tupaki Desk   |   25 Jan 2022 6:30 AM GMT
ఓటరు దినోత్సవం రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు..?
X
ప్రజాస్వాయ్యం కలిగిన ఏ దేశంలోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రజలపై ఉంటుంది. ఆ దేశంలోని ప్రజలు తమ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకొని సరైన వ్యక్తులను నాయకులుగా ఎన్నుకుంటారు. ఆ నాయకుల ద్వారా తమ దేశాభివృద్ధిని కాంక్షిస్తారు. మంచి నాయకులు రావాలంటే దేశంలోని 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్క వ్యక్తి ఓటు వినియోగించుకోవాలి. సరైన ఓటు వేసి దేశం అభివృద్ధికి తోడ్పడాలి. తమ ఓటు ద్వారా అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. అందుకే వారు వేసే ఓటు అత్యంత ప్రాధాన్యత కలిగింది. అయితే చాలా మందికి ఓటు ఎంత విలువైనదో ఇప్పటికీ అర్థం కావడం లేదు. దీంతో ప్రభుత్వాలు ఓటు ఆవశ్యక్కతను చెప్పే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తోంది. భారత్లో 2011 నుంచి ఓటరు దినోత్సవాన్ని జనవరి 25న అధికారికంగా నిర్వహిస్తున్నారు. అయితే జనవరి 25నే ఎందుకు ఎంచుకున్నారు..?

భారత ఎన్నికల సంఘం 1950లో ఏర్పడింది. జనవరి 25న ఎన్నికల కమిషన్ ఏర్పాటైనందున ఈరోజున ఓటరు దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 2011 జనవరి 25న అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఓటరు దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది 11వ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఓటర్లకు ఓటు విలువ తెలియజేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 18 ఏళ్లు నిండి ఓటను నమోదు చేసుకున్న వారికి ఈరోజు గుర్తింపు కార్డులు అందజేయనున్నారు. ఓటు నమోదు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులను అందజేస్తారు. వాటి ఆధారంగానే ఓటు వేయడానికి సాధ్యమవుతుంది. అయితే ఒక్కో సందర్భంగా ఇతర గుర్తింపు కార్డులను కూడా అనుమిస్తారు.

ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రతీసారి ఓ థీమ్ ను ఏర్పాటు చరేస్తున్నారు. ఈసారి ‘ఎన్నికలు కలుపుకొని , ప్రాప్యత, పాల్గొనేలా చేయడం అనే థీమ్ ను చేశారు. ఓటరు దినోత్సవాన్ని ప్రజాస్వామ్య పండుగలా భావిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఓటు విలువ చెబుతారు. ప్రతీ పౌరుడికి భారతదేశం పురోగతి, అభివృద్ధి ఓటు వేయడం ద్వారానే జరుగుతుందని తెలియజెబుతారు. బాధ్యాతయుతమైన ప్రతీ పౌరుడు ఓటు వేయాల్సిందే. ముఖ్యంగా యువత అర్హత వయసు రాగానే ఓటు వినియోగించుకొని దేశం అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి.

ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. తాము ఓటు కచ్చితంగా వేస్తామని ప్రమాణం చేయిస్తారు. కొన్ని పాఠశాలల్లో ఓటు విలువ తెలిపేందుకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఓ పొలింగ్ కేంద్రం లాగా సెట్ చేసి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఇక స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు ఓటు అవగాహనపై ర్యాలీలు తీస్తారు. నినాదాలు చేస్తూ ఓటు వినియోగించుకోవాలని కోరుతారు. అయితే కేవలం ఓటరు దినోత్సవం రోజునే కాకుండా ఎప్పుడు ఓటు విలువ కాపాడుకోవాలని సూచిస్తారు.