Begin typing your search above and press return to search.

నిర్మలను వెంటాడుతున్న ఆ ఫోబియా

By:  Tupaki Desk   |   15 July 2019 1:06 PM GMT
నిర్మలను వెంటాడుతున్న ఆ ఫోబియా
X
అవి నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా ఉన్న రోజులు. సీఎన్ ఎన్ ఐబీఎన్ భీకర జర్నలిస్టు కరణ్ థాపర్ తో లైవ్ ఇంటర్వ్యూకు మోడీ వచ్చాడు. గోద్రా అల్లర్లు- హత్యల వెనుక కారణాలపై మోడీని గుక్కతిప్పుకోకుండా కరణ్ ప్రశ్నించేసరికి తట్టుకోలేని మోడీ మధ్యలోనే ఇంటర్వ్యూ ఆపి వెళ్లడం అప్పట్లో సంచలనం.. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్వతంత్ర- తెలివైన జర్నలిస్టులతో ఇంటర్వ్యూలకు మోడీ రావడం లేదు. గడిచిన ఐదేళ్లలో తనకు దగ్గరైన వారితోనే ఇంటర్వ్యూలు చేయించుకొని మమ అనిపించారు. జర్నలిస్టులంటే మోడీకి ఉన్న భయం- ఫోబియా ఇప్పటికీ పోలేదంటారు.

ఇప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ కు కూడా జర్నలిస్టుల ఫోబియా పట్టుకుంది. ఆర్థికమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టి కీలకమైన బడ్జెట్ పద్దులు తయారు చేస్తున్న వేళ పార్లమెంట్ లోని నార్త్ బ్లాక్ లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిర్మలా నిషేధింయడం కలకలం రేపింది.. ఎక్కడ లూప్ హోల్స్ పసిగట్టి తనను ఇబ్బంది పెడుతారోనని నిర్మల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సమాచారం.

అయితే జర్నలిస్టులు సైతం దీనిపై కేంద్ర మంత్రి నిర్మలకు షాకిచ్చారు. తాజాగా బడ్జెట్ అనంతర విందును నిర్మలా సీతారామన్ ఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్ లో జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా ఆ విందును 180మందికి పైగా జర్నలిస్టులు బహిష్కరించారు. కొందరు బీజేపీ అనుకూల యాజమాన్యాల జర్నలిస్టులు, ఎడిటర్లు అతి తక్కువమంది అలా వెళ్లి అటెండయ్యి బహిష్కరించి వచ్చారట..

జర్నలిస్టుల గొంతునొక్కేలా నిర్మల ప్రవర్తిస్తోందని..పాత్రికేయుల స్వేచ్ఛను, భవిష్యత్ తరాల జర్నలిస్టుల ప్రయోజనాలు కాపాడేందుకే నిర్మల విందును బహిష్కరించామని జర్నలిస్టులు తెలిపారు. ఇలా మోడీ బాటలోనే జర్నలిస్టుల భయం నిర్మలను వెంటాడుతోందని తాజా సంఘటనతో అందరికీ అర్థమైంది.