Begin typing your search above and press return to search.
బాబు మీటింగ్ కు కాపు బ్యాచ్ డుమ్మా!
By: Tupaki Desk | 26 Jun 2019 10:22 AM GMTఎన్నికలు జరిగిన ఏడాది.. రెండేళ్ల వరకూ వాతావరణం ఒక్కసారిగా స్తబ్దుగా ఉంటుంది. అధికార పార్టీ అంతకంతకూ బలపడిపోతూ.. విపక్షం ఆత్మరక్షణలో ఉండిపోతుంది. ప్రతిపక్ష నేతలు బయటకు కూడా పెద్దగా రారు. అందుకు భిన్నంగా తాజాగా ఏపీ రాజకీయాలు ఉన్నయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని రీతిలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ప్రత్యర్థి పార్టీ పని పట్టేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ను ఇటీవల కాలంలో అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయి. చివరకు బంపర్ మెజార్టీ తెచ్చుకున్న మోడీ లాంటోడు సైతం తమ పార్టీకి తక్కువ పడిన రాజ్యసభ సభ్యుల లోటును భర్తీ చేసుకోవటానికి మొగ్గు చూపుతూ.. ఏపీ టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఇటీవల బీజేపీలోకి చేరిపోవటం తెలిసిందే.
ఇదంతా జరుగుతున్న సమయంలో బాబు ఫారిన్ టూర్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు.. అర్థరాత్రి దాటిన తర్వాత అమరావతిలోని తన అద్దె ఇంటికి చేరుకున్న బాబు. ఈ రోజు ఉదయం టీడీపీ కాపు నేతల సమావేశంతో పాటు. కూల్చివేతలపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒకటైతే.. కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు తాజా సమావేశానికి డమ్మా కొట్టటం ఆసక్తికరంగా మారింది.
బాబు మీటింగ్ కు రానోళ్లలో ఎక్కువమంది కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ఉండటం విశేషం. ఈ మధ్యనే కాపు సామాజిక వర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లు రహస్యంగాసమావేశం కావటం.. పార్టీ తరఫున పనిచేస్తున్న పలువురు ఎమ్మెల్యేలు.. మాజీలు అందులో హాజరు కావటం ఉత్కంట రేపింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు.. పంచకర్ల రమేశ్ బాబు కూడా మీటింగ్ కు రాలేదని చెబుతున్నారు. చూస్తుంటే బాబుకు తాజాగా కాపు తమ్ముళ్లు భారీ దెబ్బేసేట్లుగా కనిపించక మానదు.