Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు క‌డుపు మండిపోయింది

By:  Tupaki Desk   |   25 Nov 2017 4:45 AM GMT
కేసీఆర్‌కు క‌డుపు మండిపోయింది
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌డుపు మండిపోయింది. రాజ‌కీయ అంశాల్ని ప‌క్క‌న పెడితే.. సాధార‌ణ అంశాల విష‌యంలో మ‌రీ క‌డుపు మండితే త‌ప్పించి అంత త్వ‌ర‌గా ఫైర్ అయ్యే త‌త్త్వం లేని కేసీఆర్.. తాజాగా తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. యాదాద్రి కొండ మీదున్న ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి మాదిరే ఆయ‌న అధికారుల‌పై న‌ర‌సింహావ‌తార‌మెత్తారు. త‌న క‌ల‌ల రూప‌మైన యాదాద్రి ప‌నుల నిర్మాణంలో సాగుతున్న నిర్ల‌క్ష్యాన్ని చూసి త‌ట్టుకోలేక‌పోయారు.

తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ అయిన ఆయ‌న‌.. రెండేళ్ల‌కు కూడా యాదాద్రి ప‌నులు ఒక కొలిక్కి ఎందుకు రావ‌టం లేద‌ని నిల‌దీసిన ఆయ‌న‌.. త‌న తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఇదే తీరులో కొన‌సాగితే ఇర‌వైఏళ్లు దాటినా అనుకున్న ప‌నులు పూర్తి కావ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప‌నులు చేయ‌టం చేత‌కాక‌పోతే త‌ప్పుకోవాలంటూ కాంట్రాక్ట‌ర్ల మీద ఫైర్ అయిన కేసీఆర్‌.. ప‌నుల‌న్ని ముక్క‌లు ముక్క‌లుగా ఎందుకు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ర‌క్ష‌ణ గోడ‌.. రాజ‌గోపురాలు.. ఆళ్వార్ ల మ‌హా మండ‌ప నిర్మాణ ప‌నులు ఆశించిన స్థాయిలో పురోగ‌తిని ఎందుకు సాధించ‌లేక‌పోయాయి? అంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. ఇప్ప‌టిలానే ప‌నులు సాగితే వ‌చ్చే బ్ర‌హ్మోత్స‌వాల నాటికి కూడా ప‌నులు పూర్తి చేయ‌లేర‌ని తేల్చి ఆయ‌న‌.. నిర్మాణ ప‌నులు డే అంట్ నైట్ చేయొచ్చు క‌దా అని ప్ర‌శ్నించారు. గోదావ‌రి న‌దిలో నీటి ప్ర‌వాహంలోనే ప‌నులు చేస్తున్న ఈ రోజుల్లో ఈ ప‌నులు ఒక లెక్కేనా? ఒక‌వేళ ప‌ని చేయ‌టం రాకుంటే ప‌క్క‌కు త‌ప్పుకోండి.. మ‌రొక‌రు వ‌చ్చి ప‌నులు పూర్తి చేస్తారంటూ తేల్చేశారు.

భార్య‌.. కోడ‌లు.. మ‌న‌మ‌డుతో క‌లిసి యాదాద్రికి వ‌చ్చిన ఆయ‌న అక్క‌డ సాగుతున్న ప‌నుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. కేసీఆర్ ఆగ్ర‌హంలో ధ‌ర్మం ఉంద‌ని.. ముఖ్య‌మంత్రి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన ప్రాజెక్టు విష‌యంలో కాంట్రాక్ట‌రు.. అధికారులు పెద్ద‌గా శ్ర‌ద్ధ చూప‌లేద‌ని ఈ కార‌ణంగానే ఎక్క‌డి ప‌నులు అక్క‌డే అన్న‌ట్లు నిలిచిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. స్వామి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన సీఎం కేసీఆర్‌.. అక్క‌డ జ‌రుగుతున్న ప‌నుల్ని చూసి క‌డుపు ర‌గిలిపోయింద‌ని చెబుతున్నారు. కేసీఆర్ ఆగ్ర‌హం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.