Begin typing your search above and press return to search.
కేటీఆర్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వని కేసీఆర్
By: Tupaki Desk | 24 July 2017 4:53 PM GMTతండ్రి కొడుక్కి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం అనేది ఉంటుందా? అందులో తండ్రి కీలక పార్టీ అధినేత అయి ఉండి...కొడుకు భవిష్యత్ నేతగా ముద్ర ఉన్న క్రమంలో ఇలాంటిది జరుగుతుందా? జరగదు అంటారా? టీఆర్ఎస్‌లో అదే జరిగిందట. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్ రావు తన తనయుడు కేటీఆర్‌కు ఇలాగే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదట. ఈ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై రచించిన ‘ఫ్యూచర్ పర్‌ఫెక్ట్ కేటీఆర్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం తాజ్‌కృష్ణలో అట్టహాసంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం రచించిన ఈ పుస్తకాన్ని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, తెలంగాణ టుడే ఎడిటర్ కే శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ 2006తర్వాత కేసీఆర్ వలే కేటీఆర్‌కూడా రాజకీయాల్లో కీలకంగా మారారని, ఇప్పుటి రాజకీయనేతలొచ్చినంత సులువుగా కేటీఆర్ రాలేదని ఆయన తెలిపారు. కేసీఆర్ ఇష్టంతో కేటీఆర్ ఎమ్మెల్యే కాలేదని, కేటీఆర్‌కు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వని రోజులు కూడా ఉన్నాయని తెలిపారు. కేటీఆర్‌లో మొదట వీసమెత్తు రాజకీయ లక్షణాలు కనిపించలేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.
మేయర్ బొంతురామ్మోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారని, మరికొందరైతే ఏకంగా మంత్రి పదవులనే కట్టబెడుతున్నారని పరోక్షంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ను ప్రస్తావించారు. అయితే టీఆర్ఎస్‌లో కేటీఆర్ కష్టపడి పైకొచ్చి మంత్రి పదవి పొందారన్నారు. వీఐపీలకు ఇప్పుడిప్పుడే వాహనాల మీద బుగ్గలను తొలగించారని, కేటీఆర్ వాహనానికి మొదటి నుంచే బుగ్గలు లేవని పేర్కొన్నారు. విభిన్నమైన రాజకీయవేత్తగా కేటీఆర్ నిలుస్తున్నారని తెలిపారు.