Begin typing your search above and press return to search.
ఏ దేవుడైనా తన్నుకోమన్నాడన్న మాట మిత్రుడు ఓవైసీకి చెప్పరేం కేటీఆర్?
By: Tupaki Desk | 13 Jun 2022 7:30 AM GMTజట్టున్నమ్మ ఏ కొప్పు అయినా పెడుతుందన్న సామెతకు తగ్గట్లే.. తియ్యటి మాటలు చెప్పే టాలెంట్ ఉన్న నేత నోటి నుంచి వచ్చే మాటల లెక్కే వేరుగా ఉంటుంది. అవసరానికి తగ్గట్లు రాజకీయాన్ని నడిపే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో కేటీఆర్ తీరు ఉంటుందని చెప్పాలి. తమకు తగ్గట్లుగా విషయాల్ని మార్చి చెప్పటంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఆయనకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మాటలు చెప్పేస్తుంటారు మంత్రి కేటీఆర్.
చేతికి మైకు వచ్చిందంటే చాలు.. చెలరేగిపోయే కేటీఆర్.. తన తండ్రి మాదిరే మాట్లాడుతుంటారు. మాటల మధ్యలో సంబంధం లేని అంశాన్ని ప్రస్తావించటం.. తన తోటి వారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయటం.. ఇలాంటి చాలానే కళలు తన తండ్రి నుంచి అలవాటు చేసుకున్న మంత్రి కేటీఆర్.. అప్పుడప్పుడు ఆణిముత్యాల్లాంటి మాటలు చెబుతుంటారు.
ఏ దేవుడైనా తన్నుకోమన్నాడా? అంటూ తన రాజకీయ ప్రత్యర్థులై బీజేపీ నేతల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసే కేటీఆర్.. కమలనాథుల తీరును తీవ్రంగా తప్పు పడతారు.
దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేయటం ఏమిటి.. ఛండాలంగా అన్నట్లుగా మాట్లాడే ఆయన.. మరి.. నిత్యం దేవుడి పేరుతో మత రాజకీయాలు చేసే తమ మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీకి ఇలాంటి నీతులు ఎందుకు చెప్పరన్న ప్రశ్న తలెత్తుంటుంది.
బీజేపీని మత రాజకీయమని కడిగిపారేసే కేటీఆర్.. తమ జాన్ జిగిరీ మిత్రుడైన అసద్ భాయ్ కు మాత్రం ఇలాంటి ఉపదేశాలు ఎందుకు ఇవ్వరన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తే బాగుంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో మత రాజకీయాల్ని మొదలు పెట్టింది ఎవరు?.. దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన క్రెడిట్ ఎవరిదన్న విషయంపై అందరికి అవగాహన ఉన్నదే. మతం పేరుతో నిత్యం రాజకీయం నడిపే మిత్రుడ్ని ఉద్దేశించి ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా మాట అనని కేటీఆర్.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా నోరు పారేసుకోవటం వల్ల పొలిటికల్ మైలేజీ కంటే లాస్ ఎక్కువన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది.