Begin typing your search above and press return to search.

సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొంటున్న ఎంపీలు

By:  Tupaki Desk   |   3 July 2019 6:03 AM GMT
సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొంటున్న ఎంపీలు
X
ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎంపీ అన్నంత‌నే హంగు.. ఆర్భాటంతో పాటు.. పెద్ద పెద్ద కార్ల‌లో తిరిగే అసాములుగా గుర్తుకొస్తారు. కానీ.. ఈ ఎంపీల్లో కొంద‌రు ముందుచూపు.. జాగ్ర‌త్త‌ప‌రులు కూడా ఉన్నార‌న్న విష‌యాన్ని చెప్పే ఉదంతం. సీల్డ్ కార్లు వాడే ఎంపీల‌కు ఎలా అయితే కొద‌వ‌లేదో.. ఆర్మీ వాడేసి ప‌క్క‌న పెట్టేసే వాహ‌నాల్ని కొనేందుకు మ‌క్కువ చూపించే ఎంపీలు బోలెడంత‌మంది ఉన్నార‌ట‌.

దీనికి సంబంధించిన స‌మాచారం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు నిర్ణీత కాలం దాటిన వాహ‌నాల్ని వినియోగించ‌రు. ప‌క్క‌న పెట్టేస్తారు. వాటి స్థానంలో కొత్త‌వి కొంటారు. ఇలా వాడేసిన కార్ల‌ను త‌మ‌కు అమ్మాలంటూ అప్లికేష‌న్లు పెట్టుకున్న ఎంపీలు ఏకంగా 36 మంది ఉన్న‌ట్లుగా కేంద్ర‌మంత్రి శ్రీ‌పాద నాయ‌క్ తాజాగా లిఖిత పూర్వ‌క స‌మాధానంలో వెల్ల‌డించారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు పూర్తిగా వాడేసి.. జీవిత‌కాలం ముగిసిన వాహ‌నాల్ని త‌మ‌కు అమ్మాల‌ని వారుకోరుకుంటున్నార‌ట‌. ఎందుకిలా? అంటే.. కారుచౌక‌గా వాహ‌నాలు అంద‌ట‌మేన‌ని చెబుతున్నారు. ఇలా కొన్న‌వాహ‌నాల్ని కాస్త మార్పులు చేసుకుంటే మ‌స్తుగా వాడుకోవ‌చ్చంటున్నారు. అందుకే భ‌ద్ర‌తా బ‌ల‌గాలు వాడేసి ప‌క్క‌న పెట్టేసిన వాహ‌నాలకు భారీ డిమాండ్ ఉంద‌ట‌.

ఇలా అమ్మ‌కానికి వ‌చ్చే వాహ‌నాల్లో మారుతి జిప్సీ.. మ‌హీంద్రా జీపులు.. రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్లు ఉన్నాయ‌ట‌. వాడి ప‌క్క‌న పెట్టేసే వాహ‌నాలంటే తుక్కు వాహ‌నాలుగా భావిస్తే త‌ప్పులోకాలేసిన‌ట్లే. భార‌త ఆర్మీ పెట్టుకున్న మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఒక వాహ‌నాన్ని నిర్దిష్ట కాలం వ‌ర‌కే వినియోగిస్తారు. అనంత‌రం వాటిని ప‌క్క‌న పెట్టేస్తారు.

ఇలా ప‌క్క‌న పెట్టిన వాటిని అమ్మేస్తుంటారు. బ‌య‌ట‌వాళ్ల‌కు ఎందుకు మాకే అమ్మేయండ‌ని ముంద‌స్తుగా ఎంపీలు ద‌ర‌ఖాస్తు పెట్టేసుకొని త‌క్కువ ధ‌ర‌కే కొనుగోలు చేస్తుంటారు ఎంపీలు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ఇలా కారుచౌక‌లో వాహ‌నాల్ని కొనుగోలు చేసే ఎంపీలు అత్య‌ధికులు గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన వారేన‌ట‌.