Begin typing your search above and press return to search.
అంబానీ ఆస్తుల పంపకం వెనుక కథ ఇదే!
By: Tupaki Desk | 11 May 2018 2:30 PM GMTరిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా విస్తరింపజేసి ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నవ్యక్తి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా....పార్టీ ఏదైనా....దేశ రాజకీయాలను శాసించగల బడా వ్యాపారవేత్త. తన తండ్రి ధీరూభాయ్ అంబానీ అడుగుజాడల్లో నడుస్తూ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తోన్న బిజినెస్ టైకూన్. ఫోర్బ్స్ ప్రపంచపు అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో 36 వ స్థానం దక్కించుకున్న వ్యక్తి. అయితే, తన సోదరుడు అనిల్ అంబానీ తో సమానంగా ఆస్తిని దక్కించుకున్న అంబానీ.....నేడు ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు. తెలివితేటలు పెట్టుబడిగా పెట్టిన అంబానీకి అదృష్టం కూడా కలిసి రావడంతో తమ్ముడి కన్నా ఎన్నో వేల కోట్ల ఆస్తులు సంపాదించగలిగాడు.
రిలయన్స్ సామ్రాజ్యాధినేత ధీరుభాయి అంబానీ మరణానంతరం ఆయన భార్య కోకిలాబెన్ అంబానీ 2005 లో ఇద్దరు కొడుకులకు ఆస్తిని సమానంగా పంచింది. ఒకే వ్యాపారాన్ని ఇద్దరు పంచుకోకుండా....ఏదో ఒకటే తీసుకోవాలని షరతు విధించింది. దీంతో, రిలయన్స్ ఆయిల్ ను ముకేష్ ఎంచుకున్నారు. రిలయన్స్ ఆయిల్ . రిలయన్స్ గ్యాస్ - మరియు టెక్స్ టైల్స్ ముకేష్ కు దక్కాయి. అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్ ను ఎంచుకున్నారు. రిలయన్స్ టెలికాం - రిలయన్స్ కాపిటల్ - రిలయన్స్ ఇంఫ్రా - రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్ - రిలయన్స్ పవర్ ని అనిల్ అంబానీ తీసుకున్నాడు. 2005లో రూ.90000 కోట్లను అన్నదమ్ములిద్దరు సమానంగా పంచుకున్నారు. కానీ, మారుతున్న కాలానికి తగ్గట్లు వ్యాపారంలో రాణిస్తూ ముకేష్ వేల కోట్లు సంపాదించారు. రిలయన్స్ ఆయిల్ నిక్షేపాలు - జాంనగర్ పెట్రోల్ ప్లాంట్ ముకేశ్ తలరాతను మార్చాయి. దీంతో, యూపీఎ సర్కార్ `ప్రత్యేక` సాయంతో పెట్రోల్ ని రిటైల్ బిజినెస్ గా మార్చిన ముకేష్ ...ఆ తర్వాత వెనుదిరగలేదు. జాంనగర్ లో తీసే పెట్రోల్ జాతీయ సంపద అయినప్పటికీ ధర నిర్ణయించే అధికారం రిలయన్స్ కే ఇచ్చింది యూపీఏ. ఆ నిర్ణయంపై త్రీవ్ర విమర్శలు వచ్చినా...ముకేష్ వేల కోట్లు గడించారు. కూరగాయలు - చెప్పులు - బట్టలు - ఎలక్ట్రానిక్స్ TV చానెల్స్ ....రిటైల్ వ్యాపారంలో కూడా రాణించాడు.
మరోవైపు, అనిల్ అంబానీ....సరైన ప్రణాళికలు లేక నష్టాలపాలయ్యాడు. .ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఇన్ ఫ్రా విపరీతమైన నష్టాలను చవి చూసింది. దానికితోడు రిలయన్స్ కమ్యూనికేషన్ నష్టాలబాటలో పయనించింది. రిలయన్స్ ఎనర్జీ పవర్లు అనిల్ అంబానీ వ్యాపారాన్ని నిలపెట్టాయి. మరోవైపు, ముకేష్ ....JIO దెబ్బకు అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్ కూడా రూ.1000 కోట్లు నష్టపోయింది. దీంతో, చివరకు తన తల్లిని ఒప్పించి మరీ....ఇద్దరి మధ్య ఒప్పందాన్ని సవరించి రిలయన్స్ కమ్యూనికేషన్స్ లో జియోను లాంచ్ చేశాడు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ను తన గ్రూపులోకలిపేసుకొని నష్టాల్లో పడ్డ రిలయన్స్ టెలికాంని కూడా జియోలో కలిపివేసినందుకు ముకేశ్ ఒప్పకున్నాడు. ఇలా వ్యాపారంలో చురుకుకైనా నిర్ణయాలు తీసుకోలేక అనిల్ అంతకంతకూ వెనుకబడగా...ముకేష్ ముందుకు పోతున్నాడు. భారత దేశపు అపర కుబేరుడిగి ఈ ఏడాది ముకేష్ మొదటి స్థానంలో ఉంటే .... అనిల్ అంబానీ 32 వ స్థానంలో ఉన్నాడు. ముకేశ్ అంబానీ ఆదాయం విలువ రూ.2,76,544 కోట్లు ఐతే అనిల్ అంబానీ రెవిన్యూ కేవలం రూ.60,000 కోట్లు మాత్రమే.