Begin typing your search above and press return to search.

డేటా మీద డ‌ల్ అయిన లోకేష్‌!

By:  Tupaki Desk   |   4 March 2019 7:27 AM GMT
డేటా మీద డ‌ల్ అయిన లోకేష్‌!
X
డేటా చౌర్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. తెలంగాణ‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌కు దారితీస్తోంది. ప‌లువురు బ‌డా బ‌డా నాయ‌కుల‌కు ఈ కేసుతో సంబంధ‌మున్న‌ట్లు వ‌స్తున్న‌వార్త‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఆయా నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నాయి. డేటా చౌర్యం తీవ్ర‌మైన నేరం కావ‌డంతో.. త‌మ నేరం బ‌య‌ట‌ప‌డితే ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర‌వుతాయోన‌ని వారు ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది.

సైబ‌రాబాద్ పోలీసులు ఈ కేసులో విచార‌ణను వేగ‌వంతం చేశారు. త‌స్క‌ర‌ణ‌కు గురైంది కేవ‌లం ఏపీ పౌరుల స‌మాచార‌మేనా? తెలంగాణ ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త స‌మాచారానికీ ముప్పు వాటిల్లిందా? అనే కోణంలో వారు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అస‌లు ఆ స‌మాచారం ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌నే విష‌యాన్ని ఆరా తీస్తున్నారు. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్‌ కంపెనీలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ ల‌ను విశ్లేషిస్తున్నారు. వాటిని డీకోట్ చేస్తే.. ఎన్ని ఓట్లు తొలగించారు? ఎలా తొలగించారు? ఎంతమంది ఓట్లు గల్లంతయ్యాయి? ఎంతమంది ఆధార్‌ డేటాను సేకరించారు? అనే అంశాల‌ను సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

డేటా చౌర్యం కేసులో టీడీపీ నాయ‌కుల‌తోపాటు పలువురు ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని సైబ‌రాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ గ్రిడ్స్ కంపెనీ సీఈవో అశోక్ ఏపీ మంత్రి - టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కు అత్యంత స‌న్నిహితుడ‌ని తెలుస్తోంది. ఆదివారం త‌మ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ సైబ‌రాబాద్ పోలీసులు ఇచ్చిన నోటీసుల‌ను అశోక్ ఖాత‌రు చేయ‌డం విస్మ‌యం క‌లిగిస్తోంది. బ‌డా నేత‌ల అండ ఉంటేనే అలా చేయ‌గ‌ల‌ర‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. పోలీసుల‌ను ధిక్క‌రించే సాహ‌సం సాధార‌ణ వ్య‌క్తులు చేయ‌లేర‌ని సూచిస్తున్నారు.

అశోక్ త‌న‌కు స‌న్నిహితుడంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై లోకేష్ మౌనం వ‌హిస్తున్నారు. డేటా చౌర్యం కేసుపై కూడా స్పందించ‌డం లేదు. ఆయ‌న మౌనం ప్ర‌శ్నార్థ‌క‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. లోకేష్‌-అశోక్ క‌లిసి ఉన్న ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతున్నాయి. మ‌రోవైపు - ఈ కేసులో ఐటీ గ్రిడ్స్‌ ఉద్యోగులు రేగొండ భాస్కర్, కడులూరి ఫణి, గురుడు చంద్రశేఖర్, రెబ్బాల విక్రమ్ గౌడ్‌లను సోమవారం గంటలకు తమ ముందు హాజరుపరచాలని తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.