Begin typing your search above and press return to search.
మోడీ ఫోటో వైరల్ గా మారిందెందుకు?
By: Tupaki Desk | 5 Aug 2019 10:13 AM GMTదశాబ్దాల తరబడి సా..గుతున్న కశ్మీర్ సమస్యకు సర్జరీ చేసిన చందంగా ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో వేలాది మంది సైన్యాన్ని కశ్మీర్ కు తరలించటం.. భద్రతాదళాల్ని పెద్ద ఎత్తున మొహరించటం లాంటి సంకేతాలతో కశ్మీర్ విషయంలో మోడీ కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లుగా అంచనాలు వెలువడ్డాయి. దీనికి తగ్గట్లే కశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370తో పాటు.. కశ్మీరీలకు ఉండే ప్రత్యేక హక్కులకు సంబంధించిన 35 ఏను రద్దు చేయటం తెలిసిందే.
జమ్ము కశ్మీర్ ను మూడు ముక్కలుగా చేశారు. ఈ నేపథ్యంలో మోడీకి చెందినదిగా చెబుతున్న పాత ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఈ ఫోటోకు ఉన్న ప్రాధాన్యత ఏమిటన్నది చూస్తే.. ఇప్పుడు ప్రధాని హోదాలో ఆర్టికల్ 370ను రద్దు చేసిన మోడీ.. కొన్నేళ్ల క్రితం ఆర్టికల్ 370ను రద్దు చేయటం ద్వారా కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటూ నిరసనను నిర్వహించారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న బ్యానర్ కింద ఆయన నిరసన చేస్తున్న ఫోటో ఇప్పుడు వైలర్ గా మారింది. ఒకప్పుడు ఏ విషయం మీద నిరసన చేశారో.. ఇప్పుడదే నిర్ణయాన్ని ప్రధాని హోదాలో నిర్వర్తించిన వైనంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ఈ ఫోటో నిజమైనది కాదని.. మార్ఫింగ్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ఫోటో ఎంతవరకు నిజమన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.