Begin typing your search above and press return to search.
మోడీకి కార్ల కంపెనీ నోటీసు
By: Tupaki Desk | 1 Dec 2017 11:41 AM GMTవ్యాపారం విషయంలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఏ విధంగా నిక్కచ్చిగా వ్యవహరిస్తాయో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. తమకు జరగాల్సిన పనుల విషయంలో తేడా వస్తే...ఏకంగా న్యాయస్థానం నుంచి దేశ ప్రధానికే నోటీసులు పంపించింది ఓ ప్రముఖ సంస్థ. అలా పంపిన నోటీసులు అందుకున్నది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాగా....శ్రీముఖం పంపిన ఆ సంస్థ పేరు నిస్సాన్.
ఇంతకీ వివరాల్లోకి వెళితే...తమిళనాడులో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు కోసం 2008లో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో జపాన్ కు చెందిన నిస్సాన్ ఒప్పందం కుదర్చుకుంది. దీనికి సంబంధించిన ఇన్సెంటివ్స్ తమిళనాడు చెల్లించాల్సి ఉంది. 2015లో ఈ మొత్తం ఇవ్వాల్సి ఉన్నా.. తమిళనాడు మాత్రం పట్టించుకోవడం లేదని సంస్థ ఆరోపించింది. సంస్థ చైర్మన్ కార్లోస్ ఘోసన్ గతేడాది ఏకంగా ప్రధానికే లేఖ రాసినా.. ఎలాంటి ఫలితం లేదు. జపాన్ కు చెందిన నిస్సాన్ మోటార్స్ ఇండియాపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. తమకు చాలా కాలంగా రావాల్సిన ఇన్సెంటివ్స్ ను చెల్లించాలంటూ డిమాండ్ చేస్తోంది. ఈ మొత్తం సుమారు రూ.5 వేల కోట్లుగా ఉన్నది. దీనికి సంబంధించి గతేడాదే ప్రధాని నరేంద్ర మోడీకి లీగల్ నోటీస్ పంపించినట్లు నిస్సాన్ తెలిపింది.
సాక్షాత్తు ప్రధానమంత్రికే నోటీసులు రావడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. దీంతో నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది.. గతేడాది జులైలో ఈ నోటీస్ పంపిన తర్వాత నిస్సాన్ సంస్థ ప్రతినిధులు - కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య పదిసార్లకు పైనే సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల సందర్భంగా ఆ మొత్తం డబ్బు చెల్లిస్తామని, న్యాయ పోరాటం వద్దని కేంద్రం నిస్సాన్ కు హామీ ఇచ్చింది. అయినా ఫలితం లేకపోవడంతో ఈ ఏడాది ఆగస్ట్ లో ఆర్బిట్రేటర్ ను నియమించాల్సిందిగా ఇండియాకు అల్టిమేటం జారీ చేసింది నిస్సాన్. డిసెంబర్ లో దీనికి సంబంధించి తొలి వాదనలు జరగనున్నాయి.
కాగా, అంతర్జాతీయ స్థాయి మధ్యవర్తిత్వం లేకుండానే సమస్య పరిష్కారం కోసం తాము ప్రయత్నిస్తున్నామని, ఆ మొత్తాన్ని చెల్లిస్తామని తమిళనాడు ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఇలాంటివి ఇండియాపై ఇప్పటికే 20 కేసులు ఉండటం గమనార్హం. ప్రపంచంలో మరే దేశంపై ఇన్ని కేసులు లేవు. కాగా, తాజా పరిణామం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.