Begin typing your search above and press return to search.
దీదీని దెబ్బ తీసేందుకు మోడీ ఆ తప్పు చేశారా?
By: Tupaki Desk | 22 Nov 2016 7:30 PM GMTప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో పారదర్శత చాలా ఎక్కువని నమ్ముతారు. అందుకే..మిగిలిన వాటితో పోలిస్తే.. మారిన కాలానికి తగ్గట్లు ప్రజాస్వామ్యాన్నే ప్రజలంతాఓటేస్తున్నారు.కానీ.. ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ బలమైన నేతల కారణంగాకొన్ని సందర్భాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవటం తెలిసిందే. ప్రజాక్షేత్రంలో బలమైన ఇమేజ్ సంపాదించి.. వారి చేత అధికారాన్ని చేపట్టే అధినేతలు తర్వాతి కాలంలో తిరుగులేని నేతలుగా అవతరించి.. తమకు తోచినట్లుగా నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెడతారు. ఇలాంటి వారితో వచ్చే సమస్యేమిటంటే.. వారి నిర్ణయాలు రాగద్వేషాలకు అతీతంగా ఉండాల్సిందిపోయి.. వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉండటం పెద్ద సమస్యగా మారుతుంది.
తాజాగా మోడీ అలాంటి పని చేశారో లేదో కానీ.. ఇప్పుడు వెలుగు చూస్తున్న వివరాల్ని చూస్తే మాత్రం మోడీ వైపు వేలెత్తి చూపించక తప్పని పరిస్థితి. దీనికితోడు సమకాలీన రాజకీయ అంశాల్ని పరిగణలోకి తీసుకుంటే మోడీ తొందరపడ్డారేమోనన్న సందేహం కలగక మానదు. నోట్ల రద్దు నేపథ్యంలో విడుదల చేసిన రూ.2వేల నోటు మీద చాలానే ఇష్యూలు వస్తున్నాయి. నాణ్యతమీదా.. రంగు వెలిసిపోవటం మీదా వస్తున్న వాదనలు ఒక ఎత్తు అయితే..పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలు మోడీ ఇమేజ్ మీదా.. ఆయన పెద్దరికపు మాటల మీద సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. తాజాగా తీసుకొచ్చిన రూ.2వేల నోటు మీద రాయల్ బెంగాల్ టైగర్ బొమ్మను ముద్రించకపోవటం వెనుక దురుద్దేశం ఉందని ఆరోపిస్తున్నారు.
రాయల్ బెంగాల్ పులి జాతీయ జంతువన్న విషయాన్ని మర్చిపోలేం. తాజాగా విడుదల చేసిన రూ.2వేల నోటు మీద ఏనుగు.. నెమలి.. కమలం లాంటి బొమ్మలున్నాయి. ఏనుగు జాతీయ సంపద అయితే.. నెమలి జాతీయ పక్షి.. ఇకకమలం జాతీయ పుష్ఫం అలాంటప్పుడు జాతీయజంతువైన రాయల్ బెంగాల్ టైగర్ బొమ్మను ఎందుకు తొలగించినట్లు? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.మమతా బెనర్జీ కి.. మోడీకి మధ్య రాజకీయ శత్రుత్వం ఎంతన్నది అందరికి తెలిసిందే.
దీదీని దెబ్బ తీసేందుకే బెంగాల్ కు కొత్త నోటుమీద ప్రాధాన్యత దక్కకుండా చేశారన్న వాదనను కొందరు వినిపిస్తున్నా.. అందులో నిజం లేదని మరికొందరు వాదిస్తున్నారు.ఒకవేళ అలాంటిదే నిజమైతే.. కొత్త నోట్ల కూర్పు వెనుక భారీ కసరత్తు జరుగుతుంది. అలాంటప్పుడు ఈ తప్పు దొర్లే అవకాశం ఉండదని..ఉద్దేశ్యపూర్వకంగానే మోడీ సర్కారు ఈ తప్పు చేసిందన్న మాట వినిపిస్తోంది. దీదీని దెబ్బ తీసేందుకే రాయల్ బెంగాల్ టైగర్ కు సముచిత స్థానం ఇవ్వనిపక్షంలో అది మోడీ చేసిన పెద్ద పొరపాటు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా.. రెండు వేల నోటు మీద వస్తున్న విమర్శలపైకేంద్రం కానీ ఆర్ బీఐ కానీ సమాధానం చెప్పటం సబబుగా ఉంటుందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/