Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబును గుర్తించ‌లేదా.. ఆ `సీఎం`

By:  Tupaki Desk   |   3 April 2021 6:30 AM GMT
చంద్ర‌బాబును గుర్తించ‌లేదా.. ఆ `సీఎం`
X
రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు జాతీయ స్థాయిలో ఉన్న ఇమేజ్ ఏంటో తెలిసిందే. ఆయ‌న అధికారంలో ఉన్న స‌మ‌యంలోనూ.. త‌ర్వాత కూడా జాతీయ‌స్థాయిలో చ‌క్రం తిప్పారు. ఈ క్ర‌మంలో పలు ఉత్త‌రాది, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ త‌న హ‌వాను చ‌లాయించారు. ప్ర‌ధానిగా దేవెగౌడ‌ను కూర్చోబెట్ట‌డంలోను చంద్ర‌బాబు త‌నదైన శైలిని అవ‌లంబించారు. ఇక‌, 2014-19 మ‌ధ్య ఏపీ సీఎంగా ఉన్న స‌మ‌యంలోనూ ఆయ‌న జాతీయ స్తాయిలో మెరిశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స‌హా ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ను క‌లిసి.. కొన్ని విష‌యాల‌పై దూకుడు పెంచారు.

దీంతో చంద్ర‌బాబు జాతీయ రాజ‌కీయాల్లో మెరుస్తున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అటు బెంగాల్ సీఎం మ‌మ‌త‌కు, ఢిల్లీ సీఎం కేజ్రీకి కూడా బాబు చేరువ‌య్యారు. అయితే.. ఇది నిన్న‌టి మాట‌. ప్ర‌స్తుతం ఏం జ‌రుగుతోంది? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ప‌శ్చిమ బెంగాల్ లో ఈ మ‌ధ్య మ‌మ‌తా బెన‌ర్జీకి ఢిల్లీలోని కేంద్ర స‌ర్కారుకు మ‌ధ్య తీవ్ర యుద్ధం సాగుతోంది. ఈ క్ర‌మంలో మోడీని టార్గెట్ చేస్తూ.. మ‌మ‌త‌.. దూకుడుగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ``అంద‌రం క‌లిసి మోడీపై యుద్ధం చేద్దాం`` అని పేర్కొంటూ.. దేశంలోని కొంద‌రు కీల‌క నేత‌ల‌ను సెల‌క్ట్ చేసుకుని మ‌మ‌త లేఖ‌లు పంపారు.

``జాతీయ స్థాయిలో మ‌నం అంద‌రం క‌లిసి మోడీ ఇమేజ్‌ను డ్యామేజీ చేయాలి`` అనే ఉద్దేశంతో మ‌మ‌త కీల‌క నాయ‌కుల‌కు లేఖలు రాశారు. రాష్ట్రాల హ‌క్కుల‌ను మోడీ స‌ర్కారు హ‌రిస్తోంద‌ని, కేంద్రం పెత్త‌నం ఎక్కువైంద‌ని.. ఆమె పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ఈ లేఖ‌లు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు కూడా చేరాయి. అయితే.. మ‌మ‌త ఉత్త‌రాలకు ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు ఎలాంటి రిప్లై ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. ఒక‌ప్ప‌టి ముఖ్య‌మంత్రి, 40 సంవ‌త్స‌రాల పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ అయిన‌.. చంద్ర‌బాబుకు మాత్రం మ‌మ‌త ఎలాంటి లేఖ‌ను పంప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో మ‌మ‌త ఎందుకు.. బాబుకు లేఖ రాయ‌లేద‌నే విష‌యంపై సోష‌ల్ మీడియాలో కొంద‌రు చ‌ర్చ పెట్టారు. ఈ క్ర‌మంలో వారు వెలిబుచ్చిన అభిప్రాయం ప్ర‌కారం.. చంద్ర‌బాబు రాజ‌కీయంగా ఔట్ డేటెడ్ అయిపోయార‌ని, ఏపీలోనే ఆయ‌న ప‌ని అయిపోయింద‌ని కొంద‌రు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఓటుకు నోటు కేసులో .. జైలుకు వెళ్లినా.. వెళ్లొచ్చ‌ని.. కొంద‌రు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇలా ఎవ‌రికి వారు త‌మ విశ్లేష‌ణ‌లు చెప్పుకొచ్చారు. ఇక‌, ఇదే విష‌యంపై టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. మ‌మ‌త చేసిన ప‌ని..(లేఖ పంప‌క‌పోవ‌డం) బాబును అవ‌మానించిన‌ట్టేన‌ని అంటున్నారు పార్టీ సీనియ‌ర్లు!! మ‌రి బాబు ఏమ‌ను కుంటున్నారో.. తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే.