Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు.. కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్

By:  Tupaki Desk   |   20 Sep 2022 11:12 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు.. కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్
X
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా దీనిపై తెలుగు రాష్ట్రాలతోపాటు కేంద్రం, ఈసీకి కూడా నోటీసులు జారీ చేసింది. మరి దీనిపై ఎవరి వాదనలు గెలుస్తాయన్నది వేచిచూడాలి.

ఏపీ, తెలంగాణ విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలని పొందుపరిచారు. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆ విషయాన్ని పక్కనపెట్టింది. జమ్మూకశ్మీర్ ను రాష్ట్రంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అక్కడ మాత్రం అసెంబ్లీ సీట్లను పెంచింది. దీనిపై తెలుగు రాష్ట్రాల నుంచి నిరసన వ్యక్తమైంది.

తాజాగా అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలైంది. తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కి పెంచాలని .. ఏపీలో 175 నుంచి 225 వరకూ పెంచాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పిటీషన్ వేశారు.దీనిపై దాఖలైన రిట్ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

పర్యావరణ నిపుణులు ప్రొఫెసర్ కే.పురుషోత్తం రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విభజన చట్టం నిబంధనలు అమలు చేసేలా కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, కేంద్రం, ఈసీ, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ రిట్ పిటీషన్ ను జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పిటీషన్ ను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ సీట్లు పెంచాలని కోరుతున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు. కానీ జనాభా లెక్కల సేకరణ పూర్తికాకపోవడం.. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రప్రభుత్వానికి సయోధ్య లేక, ఇతర రాజకీయ అంశాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెంచకపోవడానికి కారణం. ఇలా కేంద్రానికి ఇప్పుడు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.