Begin typing your search above and press return to search.
ఇపుడెందుకు రాజీనామా చేయలేదు ?
By: Tupaki Desk | 29 Sep 2022 4:44 AM GMT'విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తాను' అని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. రైల్వే జోన్ ఇస్తామని ఒకసారి సాధ్యంకాదని మరోసారి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండు రాష్ట్రాల మధ్య జరిగిన విభజన హామీల అమలు సమావేశంలో రైల్వేజోన్ సాధ్యం కాదని రైల్వేబోర్డు అధికారులు స్పష్టంచేశారని మీడియాల్లో ప్రముఖంగా ప్రచురించింది.
దానిపైనే సాయి రెడ్డి రాజీనామా చాలెంజ్ చేశారు. ఇదే విషయమై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ మాట్లాడుతూ రైల్వేజోన్ సాధ్యం కాదని చెప్పినట్లుగా వచ్చిన వార్తలు తప్పని స్పష్టంచేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ రైల్వే జోన్ ఎప్పటిలోగా ఆచరణలోకి తీసుకొస్తామనే మాటను రైల్వేమంత్రి చెప్పటంలేదు. సరే విభజన హామీల అమలు చాలా వివాదాస్పదమైపోయాయి. ఒక్కో హామీని నరేంద్రమోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తోంది.
అయితే విజయసాయి ప్రకటన మాత్రం విచిత్రంగా ఉంది. రైల్వే జోన్ విషయంలో రాజీనామా దాకా ప్రకటించిన ఎంపీ మరి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో ఎందుకు స్పందించలేదు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటీకరించదని మాత్రమే చెబుతున్నారు.
ప్రైవేటీకరించకూడదని పార్లమెంటులో కూడా డిమాండ్ చేయటం బాగానే ఉంది. కానీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తే తాను ఎంపీగా రాజీనామా చేస్తానని సాయిరెడ్డి ఎందుకు ప్రకటించలేదు ?
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకోవటం సాయిరెడ్డికి ముఖ్యమనిపించలేదా ? ఉత్తరాంధ్ర ప్రత్యేకించి విశాఖ ప్రజలకు రైల్వే జోన్ ఎంత ముఖ్యమో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కూడా అంతే ముఖ్యం కదా. ఒకవైపు స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వేగంగా పావులు కదుపుతుంటే ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లుంటున్నారు.
ప్రజాప్రతినిధుల్లో అధికార పార్టీ నేతలకే ఎక్కువ బాధ్యతలున్న విషయాన్ని సాయి రెడ్డి మరచిపోయారా ? స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో రాజీనామా ప్రకటించకుండా రైల్వే జోన్ విషయంలోనే ఎందుకు స్పందించినట్లు ?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.