Begin typing your search above and press return to search.

ఏపీ కోసం ఎందుకు మాట్లాడొద్దు: కేటీఆర్

By:  Tupaki Desk   |   12 March 2021 11:49 AM GMT
ఏపీ కోసం ఎందుకు మాట్లాడొద్దు: కేటీఆర్
X
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిసిన మంత్రి కేటీఆర్ పై తెలంగాణ బీజేపీ నేతలు ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ నాయకురాలు విజయశాంతి అయితే 'ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్ల కోసం మాటలే తప్ప, ఈ దొర కుటుంబపు అసలు ధోరణి వేరే ఉంది.. ఆంధ్ర ప్రాంత ప్రజలపై ఎంత అసభ్యకరంగా... అవమానించే ధోరణిలో... బూతు మాటలతో కూడి ఉంటుందో ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే మంచిది' అని సెటైర్లు వేశారు. వీరి ప్రస్తుత ప్రకటనలను సమర్థిస్తున్న ఆయా నేతలు కొందరికి సరిగ్గా అర్థం అవుతుంది ఇది'' అంటూ విజయశాంతి ఎద్దేవా చేశారు.

తెలంగాణ బీజేపీ నేతలు సైతం ఏపీ వాళ్లను తిట్టే కేటీఆర్ కు ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. ఈ విమర్శలపై తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ లో తెలంగాణ ఐకాస సదస్సులో కేటీఆర్ మాట్లాడారు.
విశాఖ స్టీల్ పరిశ్రమకు వ్యతిరేకంగా తాను మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. ఏపీకి మద్దతిస్తే కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారని.. ఏపీ దేశంలో భాగంగా కాదా? అని కౌంటర్ ఇచ్చారు. ఏపీ కోసం మాట్లాడొద్దా? అని అన్నారు.

ఏపీకి కష్టం వచ్చిందని మేం నోరు మెదపకుంటే ఎలా? అని.. రేపు మాకు కష్టం వస్తే ఎవరు వస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈరోజు విశాఖ ఉక్కును బీజేపీ నేతలు అమ్ముతున్నారని.. రేపు సింగరేణి, బీహెచ్ఈఎల్ పై పడుతారని.. అందరూ ఐక్యంగా ఉంటేనే ఈ ప్రైవేటీకరణను ఆపగలం అంటూ కేటీఆర్ పిలుపునిచ్చాడు.మొదట భారతీయులం అని.. ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలం అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా అందరూ ఖండించాలని.. బీజేపీ జాతీయ వాదంలో తెలంగాణ ప్రయోజనాలు లేవా? అని ప్రశ్నించారు.