Begin typing your search above and press return to search.
ఒమైక్రాన్ సౌతాఫ్రికాలో పుట్టటానికి ఇదేనా కారణం?
By: Tupaki Desk | 30 Nov 2021 4:37 AM GMTఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. ఒమైక్రాన్ కు సంబంధించిన వివరాల మీద మాట్లాడటం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇంతకీ సౌతాఫ్రికాలో వెలుగు చేసిన ఒమైక్రాన్ వేరియంట్.. ఆ దేశంలోనే ఎందుకు పుట్టింది? దానికి కారణం ఏమై ఉంటుంది? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక కొత్త వేరియంట్ రావటానికి కారణంపై నిపుణులు పలు వాదనలు వినిపిస్తున్నారు. ఒమైక్రాన్ విషయానికి వస్తే.. సౌతాఫ్రికాలో తక్కువగా జరిగిన వ్యాక్సినేషన్ కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఇప్పటికి సౌతాఫ్రికాలో వ్యాక్సినేషన్ రేటు కేవలం 24 శాతమే కావటం గమనార్హం.
కరోనా లాంటి మాయదారి వైరస్ విరుచుకుపడినప్పుడు.. దాన్ని బలహీనపరిచే వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున.. అది కూడా వేగంగా సాగాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మ్యూటేట్ కాకుండా ఉండటమే కాదు.. కొత్త వేరియంట్ కు అవకాశం ఉండదు. ఒకవేళ.. కొత్త వేరియంట్ ఏర్పడినప్పటికి.. దాని తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. సౌతాఫ్రికాలో తక్కువ వ్యాక్సినేషన్ కవరేజ్ కూడా ఒమిక్రాన్ పుట్టుకకు కారణమన్న వాదన కొందరు వినిపిస్తున్నారు.
ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకునే కరోనా.. ప్రమాదకరమైన వేరియంట్ గా మారటానికి కారణం.. వైరస్ లో చోటు చేసుకున్న మార్పులు కూడా కారణం కావొచ్చు. మ్యూటేషన్లు అధికంగా ఉన్న వేరియంట్లు ఇది వరకు పుట్టుకొచ్చినా.. అవేమీ ఒమైక్రాన్ మాదిరి వేగంగా వ్యాప్తి చెందలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వ్యాక్సిన్ కవరేజ్ పెంచటం ద్వారా వైరస్ లో వస్తున్న మార్పులకు చెక్ పెట్టే వీలుందని చెప్పొచ్చు.
టీకా కార్యక్రమం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వేరియంట్ వ్యాప్తిని చెక్ పెట్టేలా చేస్తుందని చెప్పాలి. సౌతాఫ్రికాలో ఎక్కువగా జరగని వ్యాక్సినేషన్ తాజా పరిణామాలకు కారణంగా చెప్పాలి. ఇదంతా చూస్తే.. మనం మన దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయటం వల్ల కాసింత ప్రయోజనం ఉన్నప్పటికీ.. ముప్పు తొలిగే అవకాశం మాత్రం లేదని చెప్పాలి. సో.. మనం మాత్రమే కాదు.. మన చుట్టుపక్కల ఉన్న వారంతా వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో పూర్తి చేస్తే తప్పించి..మనమంతా ప్రశాంతంగా ఉండలేమన్న విషయం ఒమిక్రాన్ ఎపిసోడ్ తో మరోసారి ఫ్రూవ్ అయ్యిందని చెప్పక తప్పదు.