Begin typing your search above and press return to search.

అమరావతిలో పవన్ లాంగ్ మార్చ్ .. దేనికోసం ?

By:  Tupaki Desk   |   4 Nov 2019 11:56 AM GMT
అమరావతిలో పవన్ లాంగ్ మార్చ్ .. దేనికోసం ?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ఎప్పుడో జమానా కాలంలో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ , అప్పుడు పార్టీ నిర్మాణానికి సరైన సమయం లేదు అంటూ టీడీపీ , బీజేపీ కూటమిగా మద్దతుగా ప్రచారం చేసి చేతులు దులుపుకున్నారు. నా లక్ష్యం అధికారం కాదు .. ప్రజలకి సరైన పరిపాలన అందించడమే ..అంటూ ప్రశ్నిస్తా అంటూ వచ్చి .. తనకి సమయం ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రజల మధ్యకి వచ్చి జై జెనసేన అంటూ కోపం తో ఊగిపోయి మాట్లాడేవారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వేళ్తాడో ఎవరికీ తెలియదు ..మళ్ళీ ఆయనకి ఏదైనా ఒక సమస్య పై పోరాడాలి అని పిస్తే మాత్రమే స్పందిస్తాడు. లేకపోతే లేదు.

ఇక మొన్న జరిగిన ఎన్నికలలో పోటీ అయితే చేసాడు కానీ , పార్టీ నుండి కేవలం ఒకే ఒక అభ్యర్థిని మాత్రమే గెలిపించుకోగలిగాడు. అది కూడా పవన్ మీదున్న అభిమానం తో కాదు లోకల్ లీడర్ మీద ఉన్న అభిమానం తో ఆయనకి ఓట్లు వేశారని అక్కడి ప్రజలు మాట్లాడుతుంటారు. ముఖ్యంగా పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఇక ఆ తరువాత కొన్ని రోజులు మౌనం లోకి వెళ్లిన పవన్ .. తాజాగా మరోసారి నిద్రలో నుండి బయటకి వచ్చి నేను పోరాటం చేస్తా అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్య ఇసుక ..ఇసుక దొరకక కార్మికులు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఇది ప్రధానమైన సమస్య అయినప్పటికీ వర్షాల ప్రభావంతో నదులని నీటితో కళకళలాడుతున్నాయి. దీనితో ఇసుక దొరకడంలేదు. కొన్ని రోజులు ఓపిక పడితే మళ్ళీ సాధారణ స్థితి వచ్చేస్తుంది.

కానీ , దీనిపై జనసేనాని లాంగ్ మార్చ్ కి పూనుకున్నారు. కార్మికుల తరపున ప్రశ్నించే గొంతును నేను అంటూ విశాఖలో లాంగ్ మార్చ్ ఏర్పాటు చేసారు. కానీ, అది లాంగ్ మార్చ్ కంటే కారు మార్చ్ అని పిలిస్తే బాగుండేది. ఇక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ఎప్పటిలాగే పవన్ ఆద్యంతం వైఎస్ జగన్ ప్రభుత్వం విమర్శలు, ఆరోపణలతో కొనసాగింది. తనపై వ్యక్తిగతంగాను, రాజకీయంగాను విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలను పేరుపేరునా గుర్తు చేస్తూ.. తన వెర్షన్ చెప్పడంతోపాటు వారిని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడుతు. అలాగే ఏపీలో నెలకొన్న ఇసుక అవస్థలను రెండు వారాల్లో పూర్తిగా అరికట్టాలన్న అల్టిమేటం జారీచేశారు.

ఆలా కానీ పక్షం లో ఈసారి అమరావతిలో లాంగ్ మార్చ్ చేస్తానని తెలిపాడు. అయితే అయిదు నెలలుగా పేరుకుపోయిన సమస్యను రెండువారాల్లో పూర్తిగా పరిష్కరించడం సాధ్యమా అని వైసీపీ నేతలను ప్రశ్నిస్తే కనీసం 20 రోజులైనా పడుతుందని అని చెప్తున్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి పవన్ గాజువాక నియోజకవర్గం ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్ర స్థాయిలో వున్న నేతలతోను మంతనాలు జరిపారు. అధికార పార్టీ 20 రోజులైనా సమయం పడుతుందని చెబుతుంటే.. జనసేనాని విధించిన గడువు కేవలం రెండు వారాలు. సో.. జనసేన అమరావతి లాంగ్ మార్చ్‌కు సిద్దం కావాల్సిన పరిస్థితి. దీనిపై పవన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో..