Begin typing your search above and press return to search.

ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ కాళ్ల‌కు మోడీ న‌మ‌స్కార‌మా?

By:  Tupaki Desk   |   27 April 2019 6:30 AM GMT
ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ కాళ్ల‌కు మోడీ న‌మ‌స్కార‌మా?
X
మా అమ్మ అంటే ఎంతో ఇష్టం. ఏ మాత్రం వీలు చిక్కినా మా అమ్మ‌ను వెళ్లి క‌లుస్తుంటా.. అంటూ అమ్మ సెంటిమెంట్ ను పండించ‌టంలో ప్ర‌ధాని మోడీ త‌ర్వాతే ఎవ‌రైనా. ప్ర‌ముఖుడే కాదు సామాన్యుడు సైతం.. ఆ మాట‌కు వ‌స్తే ప్ర‌తి ఒక్క‌రూ త‌నకు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిని అభిమానిస్తారు.. ఆరాధిస్తారు.ఆమె రుణం తీర్చ‌టానికి తెగ ఆరాప‌డుతుంటారు. ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించే మ‌నుషుల గురించి ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌ర‌మే లేద‌నుకోండి.

మిగిలిన రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పోలిస్తే.. మోడీ ప‌ది ఆకులు ఎక్కువ చ‌దివిన‌ట్లుగా చెప్పాలి. వృద్ధురాలైన త‌న త‌ల్లిని ప్ర‌చార సాధ‌నంగా.. త‌న ఇమేజ్ బిల్డింగ్ కోసం వినియోగించుకోవ‌టంలో న‌మోకు సాటి ఎవ‌రూ రార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మా అమ్మ‌ను నా ద‌గ్గ‌ర ఉంచుకోక‌పోవ‌టానికి కార‌ణం ఇదేనంటూ.. అర్థం లేని కార‌ణాన్ని చెప్పిన ఆయ‌న‌.. అదే స‌మ‌యంలో డీఎంకే అధినేత‌.. దివంగ‌త క‌రుణానిధిని త‌న ఇంట్లో ఉంచుకొని మెరుగైన వైద్యం చేయిస్తాన‌న్న మోడీ మాట‌ను మ‌ర్చిపోలేం.

క‌న్న‌త‌ల్లిని త‌న‌తో ఉంచుకోవ‌టానికి ఇబ్బందుల‌కు గుర‌య్యే మోడీ.. త‌న‌కేమాత్రం సంబంధం లేని క‌రుణ‌ను మాత్రం త‌న ఇంట్లో ఉంచుకొని స‌ప‌ర్య‌లు చేయ‌టానికి వెనుకాడ‌ని తీరులో రాజ‌కీయ‌మే క‌నిపిస్తుంటుంది. పాత విష‌యాల్ని వ‌దిలేస్తే.. ఇటీవ‌ల కాలంలో చోటుచేసుకున్న రెండు ప‌రిణామాల్ని ఇక్క‌డ ప్ర‌స్తావించాలి. ఓటు వేసేందుకు ఊరికి వ‌చ్చిన మోడీ.. ఓటు వేయ‌టానికి ముందు త‌ల్లిని క‌లిసి ఆశీర్వాదం తీసుకోవ‌టం.. దానికి అవ‌స‌ర‌మైన విజువ‌ల్స్ అన్ని ఛాన‌ల్స్ లో ప్ర‌ముఖంగా ద‌ర్శ‌న‌మిచ్చాయి.

మ‌రింత హ‌డావుడి చేసిన మోడీ.. త‌న త‌ల్లిని త‌న వెంట తెచ్చుకొని ఓటు వేయించే బాధ్య‌త ఎందుకు తీసుకోరో అర్థం కాదు. ప్ర‌ధాన‌మంత్రి అయిన కొడుకు త‌న‌ను వెంట పెట్టుకొని పోలింగ్ స్టేష‌న్ కు వ‌చ్చి ఓటువేయిస్తే.. ఆ త‌ల్లికి ఎంత ఆనందంగా ఉంటుంది? కేవ‌లం వీడియోల‌లో క‌నిపించ‌టానికి.. ఫోటోల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌టానికి ఆస‌క్తి చూపించే మోడీ.. అస‌లు విష‌యాల్ని మాత్రం ప‌క్క‌న పెట్టేస్తుంటార‌ని చెబుతారు.

తాజాగా వార‌ణాసిలో నామినేష‌న్ దాఖ‌లు కార్య‌క్ర‌మాన్ని పెద్ద‌గా చేసి చూపించిన మోడీ.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అకాలీద‌ళ్ కురువృద్ధుడు ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ కాళ్ల‌కు న‌మ‌స్కారం చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న రాజ‌కీయ గురువు.. ఈ రోజున ఈ స్థానంలో ఉండ‌టానికి కార‌ణ‌మైన అద్వానీ ఆశీర్వాదం తీసుకున్నట్లుగా ఏ మీడియా రిపోర్ట్ చేయ‌లేదు. ఆ మాట‌కు వ‌స్తే.. నామినేష‌న్ దాఖ‌లు కార్య‌క్ర‌మానికి బీజేపీ ప్ర‌ముఖులు.. ఎన్డీయే మిత్ర‌బృందం మోడీ వెంట ఉన్నా.. అద్వానీ మాత్రం క‌నిపించ‌కపోవ‌టం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ బాద‌ల్ కాళ్ల‌కు న‌మ‌స్కారం పెట్ట‌టం ఎందుకు? అంటే.. పెద్ద వాళ్ల మీద త‌న‌కున్న ప్రేమాభిమానాలు ఎంత‌న్న విష‌యాన్ని చెప్ప‌టంతో పాటు.. బీజేపీకి అంత అనుకూలంగా లేని పంజాబ్ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకోవ‌టానికి వీలుగా త‌న‌కు అల‌వాటైన మేజిక్ ను మోడీ చేశార‌ని చెప్పాలి. ఎప్పుడేం చేస్తే.. ఎంత మైలేజీ వ‌స్తుందో మోడీ మాష్టారికి మించి తెలిసినోళ్లు ఎవ‌రుంటారు చెప్పండి.