Begin typing your search above and press return to search.

మునావర్ ఫారూకీతో రాజాసింగ్ కు గొడవేంటి? ఎందుకు అడ్డుకుంటున్నాడు?

By:  Tupaki Desk   |   19 Aug 2022 11:30 AM GMT
మునావర్ ఫారూకీతో రాజాసింగ్ కు గొడవేంటి? ఎందుకు అడ్డుకుంటున్నాడు?
X
తెలంగాణలో ఇప్పుడు 'మునావర్ ఫారూఖీ' కామెడీ షో ప్రకంపనలు రేుతోంది. ఈ స్టాండప్ కామెడీ షో పై బీజేపీ కత్తి కట్టింది. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే మునావర్ షోను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు. రాజాసింగ్ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేను ముందస్తుగా అదుపులొకి తీసుకొని పోలీసులు భారీగా మోహరించారు. హౌస్ అరెస్ట్ చేశారు.

-ఎవరీ మునావర్ ఫారూఖీ

వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ కామెడీ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. శనివారం సాయంత్రం 4 గంటలకు శిల్పాకళ వేదికలో మునావార్ షో జరుగనుంది.

అయితే హిందూ దేవతలను అవమానిస్తూ గతంలో వ్యాఖ్యలు చేసిన ఇలాంటి వ్యక్తికి అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ , హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మునావర్ ఫారూఖీ కామెడీ షోను అడ్డుకుంటామని ఇప్పటికే స్పష్టం చేసింది. పోలీసులు అనుమతి ఇవ్వవద్దని కోరారు.

-కేటీఆర్ ఆహ్వానంతో హీట్

మునావర్ ను హైదరాబాద్ కు ఆహ్వానించారు మంత్రి కేటీఆర్.. కోవిడ్ కారణంగా మునావర్ గతంలో ఇక్కడికి రాలేదు. ఇప్పుడు వస్తుండడంతో కామెడీ షోకు పోలీసులు అనుమతినిచ్చారు.మతంతో సంబంధం లేదని.. కామెడీ షోకు అనుమతిచ్చామని పోలీసులు చెబుతున్నారు. తాము వ్యతిరేకిస్తున్న మునావర్ ను కేటీఆర్ ఆహ్వానించడం.. హైదరాబాద్ లో చేస్తుండడంపై బీజేపీ భగ్గుమంది. హిందువులను కించపరిచే వ్యక్తి కార్యక్రమానికి ఎలా అనుమతిచ్చారంటూ మంత్రి కేటీఆర్ ను రాజాసింగ్ ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ డిస్ట్రబ్ అయితే పోలీసులే బాధ్యత అని హెచ్చరించారు.

-రాముడు, సీతను అవమానించేలా మునావర్ గతంలో వ్యాఖ్యలు

మునావర్ గతంలో స్టాండప్ కామెడీలో రాముడు, సీత లాంటి హిందూ దేవుళ్లపై కామెంట్ చేశారని ఆరోపణలున్నాయి. హిందూ దేవుళ్లను అవమానిస్తూ జరిగే మునావర్ షోను చాలా రాష్ట్రాలు రద్దు చేశాయి. ఇటీవలే ఇండోర్, ముంబై, కర్నాటకలోనూ అతడి కార్యక్రమాలను ప్రభుత్వాలు రద్దు చేశాయి. కేటీఆర్ అనుమతివ్వడంపై బీజేపీ భగ్గుమంటోంది.

కేటీఆర్ సారీ చెప్పాలని.. మునావర్ షోను అడ్డుకొని తీరుతామని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఇప్పటికే తమ కార్యకర్తలు ఆ షోకు ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకున్నారన్నారు. తమ రామసైన్యం మునావర్ షోను అడ్డుకుంటుందని రాజాసింగ్ చెప్పారు. రాముడి బలమెంటో చూపిస్తామని రాజాసింగ్ అనడంతో హైదరాబాద్ లో మునావర్ షోతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.