Begin typing your search above and press return to search.
రాయలసీమ ఎక్స్ ప్రెస్ ఇప్పుడెందుకు హాట్ టాపిక్?
By: Tupaki Desk | 15 Jun 2020 4:00 AM GMTదేశంలోని ఏ ప్రాంతమైనా కానీ.. తిరుపతికి ట్రైన్ అంటే.. టికెట్టు దొరకటం కష్టం. కనీసం నెల ముందే రిజర్వు సీట్లు మొత్తం నిండిపోవటమే కాదు.. కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ లిస్టు భారీగా ఉండే పరిస్థితి. ఇక.. నిజామాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రాయలసీమ ఎక్స్ ప్రెస్ సంగతి చెప్పాల్సిన అవసరమేలేదు. నిత్యం కిటకిటలాడే ఈ ట్రైన్లో ఏసీ బోగీల్లో బెర్తు లభించటం చాలా కష్టంగా ఉండేది.
కరోనా దెబ్బకు ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. దూర ప్రాంతాలకు ఎంతో అవసరమైతే తప్పించి వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గింది. పుణ్యక్షేత్రాలకు వెళ్లటం మీద ప్రజలు ఆసక్తిని చూపించటం లేదు. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనంగా రాయలసీమ ఎక్స్ ప్రెస్ ఏసీ బోగీలు కనిపిస్తున్నాయి.
జూన్ ఒక నుంచి స్టార్ట్ అయిన ఈ సర్వీసులో సగం బెర్తులు కూడా నిండటం లేదని చెబుతున్నారు. శనివారం సాయంత్రం తిరుపతి నుంచి నిజామాబాద్ కు బయలుదేరిన రైల్లో మొత్తం ఎనిమిది ఏసీ బోగీలు ఉన్నాయి. దాదాపు ఆరు వందకు పైనే బెర్తులు ఉండే.. ఈ బోగీలకు కేవలం నలభై మంది మాత్రమే ప్రయాణికులు ఉండటం గమనార్హం. తిరుపతిలో బయలుదేరినప్పుడు ఈ బోగీల్లో 40 మంది ఉన్న ప్రయాణికులు సికింద్రాబాద్ కు చేరుకునే సమయానికి కేవలం ఏడుగురు ప్రయాణికులే మిగలటం ఒక విశేషమైతే.. వీరితోనే ఆ బోగీలన్ని నిజామాబాద్ వరకు వెళ్లాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మహమ్మారి ప్రభావం ఎంత ఎక్కువన్నది కళ్లకు కట్టినట్లుగా రాయలసీమ స్పెషల్ రైలును చూస్తే ఇట్టే తెలుస్తుంది.