Begin typing your search above and press return to search.
బీజేపీలోకి రాయపాటి.. ఎందుకంటే?
By: Tupaki Desk | 17 July 2019 7:31 AM GMTరాయపాటి అన్నంతనే కాంగ్రెస్‌పార్టీ గుర్తుకు వస్తుంది. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా.. గుంటూరుజిల్లాలో పలుకుబడి.. ప్రజాదరణ ఉన్న నేతల్లో ఒకరిగా పేరున్న రాయపాటిని తమ పార్టీలో చేర్చుకోవాలన్న ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన టీడీపీలో కొనసాగేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదని.. అదే సమయంలో ఆ పార్టీకి సమీప భవిష్యత్తులో అవకాశాల్లేవన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఆయన బీజేపీ వైపు దృష్టి సారించినట్లుగా సమాచారం. తనలాంటి స్థాయి కలిగిన నేత.. తనకు తాను బీజేపీలో చేరటం బాగోదు కాబట్టి..ప్రపోజల్ బీజేపీ వైపు నుంచే వస్తే బాగుంటుందన్న భావనను వ్యక్తం చేయటంతో.. రాయపాటి పార్టీ మారేందుకు అవసరమైన కథ.. స్క్రీన్ ప్లే సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
మోడీషాలకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైనా రాంమాధవ్ రంగంలోకి దిగి.. తాజాగా రాయపాటి వారిని వారింట్లోనే కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య విందు రాజకీయం జోరుగా నడిచినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా తమ పార్టీలోకి రావాల్సిందిగా రాయపాటిని రాంమాధవ్ ఆహ్వానించటం.. అందుకు ఆయన ఓకేచెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ మారే క్రమంలో వ్యాపార పరంగా తనకున్న ఇబ్బందులు.. ఢిల్లీలో ఉన్న ఇష్యూను రాంమాధవ్ దృష్టికి తీసుకెళ్లటం ఆయన అందుకు అవసరమైన భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
రెండు..మూడు రోజుల్లో తాను ఢిల్లీ వస్తానని చెప్పిన రాయపాటి బీజేపీ నేత రాంమాధవ్ ను సంతోషంతో పంపించారు. విందు సమావేశం జరిగిన తర్వాతి రోజున టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు రాయపాటి. తనకున్న పరిస్థితుల్లో తాను ప్రస్తుతం బీజేపీలో చేరక తప్పని పరిస్థితి అని.. తనను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి చంద్రబాబు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో తానున్న నివాసానికి సంబంధించి సమస్యలు ఉన్నాయని.. వాటిని సరి చేసుకోవటంతోపాటు.. వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందుల్ని అధిగమించాల్సిన అవసరం ఉందన్న మాటతో బాబు ఏమీ మాట్లాడలేకపోయారంటున్నారు. మొత్తంగా చూస్తే.. కారణాలు ఏమైనా.. ఆఫర్లు మరేం ఇచ్చినా రాయపాటి మెడలో కండువా కలర్ మారటం మాత్రం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.