Begin typing your search above and press return to search.

NNN అంటే ఏంటి? నవంబర్ లో శృంగారానికి ఎందుకు దూరంగా ఉండాలి?

By:  Tupaki Desk   |   2 Nov 2021 11:30 PM GMT
NNN అంటే ఏంటి? నవంబర్ లో శృంగారానికి ఎందుకు దూరంగా ఉండాలి?
X
నవంబర్ వచ్చిందంటే చాలు పురుషులు దీక్ష చేస్తారు. ఇదో సరికొత్త దీక్ష.. నవంబర్ నెల మొదలైందంటే చాలు.. పురుషులంతా శృంగారానికి బైబై చెప్పేస్తారు. కనీసం స్వయంతృప్తి కూడా పొందకూడదు. చివరకు పోర్న్ చూసినా NNN (No Nut November) నిబంధనను అతిక్రమించినట్టే. ఇంతకీ ఏమిటీ NNN అంటే ఏంటి? ఈ నోట్ నిబంధన ఏంటి? అనేది తెలుసుకుందాం..

ఛీ పాడు ఇదే కల్చర్ అని ముక్కున వేసుకోవద్దు.. ఈ ట్రెండ్ ఇప్పుడు మొదలైంది కాదు.. 2010 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషుల్లో కొందరు NNN పేరుతో నవంబర్ నెల మొత్తం నిగ్రహంగా ఉంటున్నారు. నవంబర్ మొదలైందంటే చాలు.. వీరంతా బుద్దిమంతులైపోతారు. అశ్లీలత పేరు వింటే చాలు చిర్రెత్తుకొస్తుంది. ఇప్పటివరకు రెడిట్ సోషల్ మీడియా ద్వారా 90వేల మంది NNN మీద అవగాహన కల్పిస్తున్నారు. 30 రోజుల పాటు సంఘీభావం తెలుపుతూ మీమ్స్ పోస్ట్ చేస్తారు. నెల మొత్తం శృంగారం, స్వయంతృప్తికి దూరంగా ఉంటారు.

సాధారణంగా పురుషుల్లో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది వాటిని నియంత్రించుకోలేరు. దాని వల్ల పోర్న్ వీడియోలు చూడటం.. స్వయంగా తృప్తి పొందడం.. భాగస్వామితో కోరికలు తీర్చుకోవడంలో బిజీగా ఉంటారు.

ఇలాంటి చర్యలకు కనీసం ఒక నెల విరామం తెలిపింతే ఆరోగ్యానికే కాకుండా మనసుకు కూడా చాలా మంచిదని నో నట్స్ నవంబర్ ఫాలోవర్ల భావన. ఈ సందర్భంగా ఈనెలను ఛాలెంజ్ గా తీసుకుంటారు. నిగ్రహంతో ఉండి సెక్స్ మీద మనసు మరలకుండా ఇతర విషయాల మీద దృష్టిపెడుతారు. దీనివల్ల మానసిక స్పష్టత ఏర్పడుతుంది. దీక్షను పాటించడంలో విఫలమైతే వారు తమ లైంగిక జీవితాన్ని కొనసాగించవచ్చు.

NNN నిబంధనల ప్రకారం.. 30 రోజుల వరకూ ఎలాంటి లైంగిక చర్యలకు పాల్పడకూడదు. కనీసం పోర్న్ చూసినా విఫలమైనట్లే. కేవలం సెక్స్ కలలు కనేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. 2010 నుంచి కొంతమంది పురుషులు దీన్ని నిష్ట పాటిస్తూ వస్తున్నారు. లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉన్న వారిలో శారీరక మానసిక ఆరోగ్యం బాగా మెరుగుపడిందట..